Share News

టీడీపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం

ABN , Publish Date - May 12 , 2024 | 12:37 AM

తీరప్రాంత ప్రజలు రెండుసార్లుగా నాపై నమ్మకంతో ఆదరించారని సోమవారం జరిగే ఎన్నికల్లో మహిళలు, ప్రజలు అండగా నిలిచి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రజలను కోరారు.

టీడీపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం

రేపల్లె, మే 11 : తీరప్రాంత ప్రజలు రెండుసార్లుగా నాపై నమ్మకంతో ఆదరించారని సోమవారం జరిగే ఎన్నికల్లో మహిళలు, ప్రజలు అండగా నిలిచి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రజలను కోరారు. నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి, కొమరవోలు, ముత్తుపల్లి, చెరుకుపల్లి మండలం పొదిలిపల్లివారిపాలెంలో శనివారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఎన్నికల ముగింపు ప్రచారం నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అనగానికి గుమ్మడికాయతో దిష్టితీసి వీరతిలకం తీసి హారతులు తీసి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ రానున్నది ఏన్డీయే కూటమి ప్రభుత్వమేనని, తీరప్రాంత అభివృద్థి చేస్తానని ప్రజలకు హమీనిచ్చారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వ కూటిమి ఏర్పాటు చేసిన సూపర్‌సిక్స్‌ పథకాలతో మీరు అన్ని విధాలా అభివృద్థి చెందుతారని ఆకాంక్షించారు. జగనరెడ్డికి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్థి చెందాలంటే ప్రతి ఒక్కరూ టీడీపీ అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నర్రా సుబ్బయ్య, తాతా ఏడుకొండలు, పూషడపు కుమారస్వామి, పిట్టు శ్రీనివాస్‌రెడ్డి, మల్లాది రామకృష్ణ, కేసన రామకృష్ణ, జనసేన నాయకులు మత్తి భాస్కరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:37 AM