ప్రజలు జగనను ఛీకొట్టటంతోనే భారీ మెజార్టీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:13 AM
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. సైనికుల్లా పని చేయడం, జగ న్మోహనరెడ్డి పాల నని ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజా ర్టీతో గెలిచింద ని తూర్పు ఎమ్మెల్యే నసీర్ చెప్పారు.

గుంటూరు, జూన 6(ఆంధ్ర జ్యోతి): టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. సైనికుల్లా పని చేయడం, జగ న్మోహనరెడ్డి పాల నని ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజా ర్టీతో గెలిచింద ని తూర్పు ఎమ్మెల్యే నసీర్ చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్ని కైన తరువాత తొలిసారిగా గురువా రం ఆయన విలేకరులతో మాట్లా డారు. భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించినప్పటికీ ము స్లింలు కూటమికి పట్టం కట్టారని కొనియాడారు. గుంటూరు నగర పాలక సంస్థలో అర్థరాత్రి అవినీతి ఫైళ్ళు కదులుతున్నాయని, ఎక్కడ తేడా జరిగినా అధికారులతో పాటూ గత పాలకులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ నాయకులు పిల్లి మాణిక్య రావు చిట్టిబాబు, మద్దిరాల మ్యానీ సమావేశంలో పాల్గొన్నారు.