Share News

గిరిజనుల ఆరాధ్య దైవం ‘వెన్నెలకంటి రాఘవయ్య’

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:13 AM

గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన యోధుడు వెన్నెలకంటి రాఘవయ్య అని తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ కొనియా డారు.

గిరిజనుల ఆరాధ్య దైవం ‘వెన్నెలకంటి రాఘవయ్య’

గుంటూరు(తూర్పు), జూలై 7: గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన యోధుడు వెన్నెలకంటి రాఘవయ్య అని తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ కొనియా డారు. స్థానిక నాజ్‌ సెంటర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నసీర్‌ మాట్లాడుతూ గిరి జనుల పట్ల శాపంగా మారిన అతిభయంకర, క్రూరమైన 1871 ట్రైబల్‌ యాక్టు రద్దు లో వెన్నెలకంటి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. పెన్నా, కృష్ణా నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కృషి ఎనలేనదని అన్నారు. అటువంటి వ్యక్తికి గుంటూరులో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యానాది అభి వృద్ధి, సంక్షేమ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల ఏసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కే ఏడుకొండలు, కృష్ణనాయక్‌, కస్తూరి సైదులు, బ్రహ్మయ్య, బీసీ నాయకులు అంగిరేకుల వరప్రసాదు, కార్పొరేటర్‌ సమత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:13 AM