రోటరీ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:08 AM
రోటరీక్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు.
బాపట్ల,జూలై 7 : రోటరీక్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం రాత్రి విజయలక్ష్మీపురంలోని రోటరీ కల్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రావూరి వీరరాఘవయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోటరీక్లబ్ సభ్యులంతా ఐక్యంగా ఉండి సేవలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు, ఎయిమ్ ఫర్ సేవా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. నూతన అధ్యక్షుడిగా కోళ్ళపూడి ఉపేంద్రగుప్తా, కార్యదర్శిగా వేజండ్ల శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా కె.ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారిగా వి.వేణుగోపాల్, కొత్త సుబ్బారావులతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడ బికె ఇండస్ర్టీస్ సంకటి బ్రహ్మారెడ్డి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకటశివన్నారాయణ, కొల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.