ఎమ్మార్పీఎస్ కృషి మరువలేనిది
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:15 AM
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కృషి మరువలేనిదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. చంద్రబాబు నివాసం వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గుంటూరు, జూన 6(ఆంధ్రజ్యోతి): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కృషి మరువలేనిదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. చంద్రబాబు నివాసం వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మాధవి, నేడు ప్రజా ప్రతినిధిగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారన్న నమ్మకం తనకు ఉందని, పేదల మనిషి మాధవి అని మందకృష్ణ మాదిగ అభినందించారు.