Share News

రీచ్‌లో మైనింగ్‌ అధికారుల పరిశీలన

ABN , Publish Date - May 19 , 2024 | 12:59 AM

ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాల ద్వారా ఇసుక ను క్వారీయింగ్‌ చేసి కోర్టులను తప్పుదోవ పట్టించిన అధి కారుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి గ్రౌండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించిన మేరకు జిల్లా స్థాయి అధికారులు శనివారం మధ్యాహ్నం అమరావతి మండలపరిధిలోని మల్లాది గ్రామంలోని ఇసుక రీచ్‌ను సందర్శించారు.

రీచ్‌లో మైనింగ్‌ అధికారుల పరిశీలన

అమరావతి, మే 18: ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాల ద్వారా ఇసుక ను క్వారీయింగ్‌ చేసి కోర్టులను తప్పుదోవ పట్టించిన అధి కారుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి గ్రౌండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించిన మేరకు జిల్లా స్థాయి అధికారులు శనివారం మధ్యాహ్నం అమరావతి మండలపరిధిలోని మల్లాది గ్రామంలోని ఇసుక రీచ్‌ను సందర్శించారు. రెండు రోజుల వర కు యంత్రాల ద్వారా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను అధికార పార్టీ నాయకులు తరలించి సొమ్ము చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశాల మేరకు అక్రమంగా తరలించిన ఇసుక క్వాంటిటీని లెక్కిం చేందుకు, తవ్వకాలు జరిపిన ప్రదేశం బౌం డరీ నిర్ధారించేందుకు ఇరిగేషన్‌, మైనింగ్‌, స్టెప్‌, పొల్యూషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు మూకుమ్మడిగా మల్లాది రీచ్‌లో అక్రమ క్వారీ యింగ్‌ జరిగిన ప్రదేశాన్ని గుర్తించి బౌండరీలు నిర్దారించి, ఇసుక తీసిన గుంతలను కొలిచి లెక్కించారు. దీనికి సంబంధించిన గ్రౌండ్‌ రిపోర్టును ఇన్‌చార్జి కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఆదివారం వైకుంఠపురం రీచ్‌లో అక్రమ తవ్వకాలు జరిపిన ప్రదేశాలను సందర్శించి గ్రౌండ్‌ రిపోర్టు తయారు చేయనున్నారు. కార్యక్రమంలో ఏడీ మైన్స్‌ అధికారి నాగిని, ఏంపీడీవో రాణి, తహసీల్దార్‌ వెంకట రమణారావు, ఎస్‌ఐ నరసింహ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:59 AM