Share News

అమర్‌నాథ్‌ కేసును ఫాస్ట్‌ట్రాక్ట్‌ ద్వారా విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:45 AM

చిన్న వయసులోనే కిరాతకంగా చంపబడిన విద్యార్థి అమర్‌నాథ్‌ కేసును ఇప్పుడు మారిన ప్రభుత్వాలైన ఫాస్ట్‌ట్రాక్ట్‌ ద్వారా విచారణ జరిపించాలని సీపీఎం బాపట్ల జిల్లా కమిటి సభ్యులు సిహెచ మణిలాల్‌ అన్నారు.

అమర్‌నాథ్‌ కేసును ఫాస్ట్‌ట్రాక్ట్‌ ద్వారా విచారణ జరిపించాలి

రేపల్లె, జూన 16 : చిన్న వయసులోనే కిరాతకంగా చంపబడిన విద్యార్థి అమర్‌నాథ్‌ కేసును ఇప్పుడు మారిన ప్రభుత్వాలైన ఫాస్ట్‌ట్రాక్ట్‌ ద్వారా విచారణ జరిపించాలని సీపీఎం బాపట్ల జిల్లా కమిటి సభ్యులు సిహెచ మణిలాల్‌ అన్నారు. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో విద్యార్థి అమర్‌నాథ్‌ మొదటి వర్థంతి సందర్బంగా సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోదరి, తల్లికి ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ ఇచ్చిన హామీ ప్రకారం త్వరితగతిన కేసు విచారణ చేయించాలన్నారు. ఇలాంటి సంఘటనలు మరలా రాష్ట్రంలో జరగకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాజంలో మహిళలు, విద్యార్థుల మీద రోజువారి అనేక దాడులు హత్యలు జరుగుతున్న చట్టాలు సమర్థవంతంగా అమలు కానందున ఆలస్యంగా విచారణ జరగటంతో దోషులు దర్జాగా రోడ్లపైన తిరుగుతున్నారన్నారు. శిక్షలు పడతాయని భయం లేకపోవటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చిత్తశుద్థితో విచారణ జరిపించి దోషులకు శిక్ష వెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి మండల కార్యదర్శి కె.శరతబాబు, కొప్పుల గోపి, ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు పి.మనోజ్‌కుమార్‌, పలు ప్రజా సంఘాల జేఏసీ, బీసీ గౌడ సంఘాల నేతలు, అమర్‌నాథ్‌ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:45 AM