Share News

ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - May 31 , 2024 | 12:50 AM

జూన 4వ తేదీన తలపెట్టిన సార్వత్రిక ఎన్ని కల ఓట్ల లెక్కింపునకు అవసరమైన స్టేషనరీని వెంటనే సిద్ధం చేసి, యూనివర్సిటీలోని లెక్కింపు కేంద్రానికి తరలించాలని తూర్పు నియో జకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అధికారుల ను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి చేకూరి తదితరులు

గుంటూరు, మే 30: జూన 4వ తేదీన తలపెట్టిన సార్వత్రిక ఎన్ని కల ఓట్ల లెక్కింపునకు అవసరమైన స్టేషనరీని వెంటనే సిద్ధం చేసి, యూనివర్సిటీలోని లెక్కింపు కేంద్రానికి తరలించాలని తూర్పు నియో జకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అధికారుల ను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. కమిషనర్‌ మాట్లాడుతూ కౌం టింగ్‌ రోజు ఉదయం 6 గంటలకల్లా అభ్యర్థులు, ఏజంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి రావాలని నోటీసు ద్వారా సమాచారం అందించాలన్నారు. ఓట్ల లెక్కింపులో తొలుతగా పోస్టల్‌ బ్యాలెట్స్‌, సర్వీస్‌ ఓట్లు లెక్కిం చడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు ఎన్ని కల కమిషన్‌ మార్గదర్శకాలకు సంబంధించిన సూచనలను ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు తప్పనిసరిగా చదివి అర్ధం చేసుకోవాలన్నారు. విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది కౌంటింగ్‌ రోజు తప్పనిసరిగా నిర్దేశిత సమయానికి, తగిన గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, కౌంటింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలో త గిన టేబుల్స్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, కంప్యూటర్లు, ఆపరేటర్లు ఉండేలా పర్యవేక్షణ చేయాలని ఈఈని ఆదేశించారు. స్ర్టాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంలు తీసుకొచ్చేందుకు, అధికారులు, లెక్కింపు సిబ్బంది, అభ్యర్థులు, ఏజంట్లు లెక్కింపు కేంద్రంలోకి వచ్చేందుకు వేర్వేరుగా మా ర్గాల సూచికలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే బారీకేడింగ్‌ చేపట్టా లని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏఆర్‌ఓ లు వెంకటలక్ష్మి, సునీల్‌ కుమార్‌, భీమరాజు, ప్రదీప్‌ కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, ఈఈ సుందర్రామిరెడ్డి, మేనేజర్‌ ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ ఆర్‌వో రాజ్యలక్ష్మి అధికారులతో సమీక్ష....

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లకు సంబంధించి పశ్చిమ రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ రాజ్యలక్ష్మి అధికారులతో తన చాంబర్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ ఈసీ మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సీహెచ శ్రీనివాసరావు, ఈఈలు కొండారెడ్డి, కోటేశ్వరరావు, డీఈఈలు రిఫిక్‌, సూపరింటెండెంట్లు వెంకటరామయ్య, పద్మ, ఏసీపీ అజయ్‌ తదితరులున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:50 AM