కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు 31లోగా అందించాలి
ABN , Publish Date - May 26 , 2024 | 12:55 AM
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు హాజరయ్యే ఏజెంట్ల వివరాలు ఈనెల 31లోపు రిటర్నింగ్ అధి కారి కార్యాలయంలో అందించాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థు లకు తెలిపారు.
గుంటూరు(కార్పొరేషన్), మే 25 : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు హాజరయ్యే ఏజెంట్ల వివరాలు ఈనెల 31లోపు రిటర్నింగ్ అధి కారి కార్యాలయంలో అందించాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థు లకు తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రిట ర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు పై గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లతో శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ఓ, కమిషనర్ మాట్లాడుతూ జూన్ 4న ఆచార్య నాగార్జున యూని వర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు సజావుగా జరగడానికి అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించా లన్నారు. లెక్కింపు కేంద్రానికి హాజరయ్యే ఏజెంట్లు తగిన వివరాలతో ఈ నెల 31లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వా లన్నారు. జూన్ 3వ తేదీన ఆర్‌ఓ కార్యాలయంలోని స్ర్టాంగ్ రూమ్‌లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను యూనివర్సిటీలోని స్ర్టాంగ్ రూమ్‌కి తరలిస్తామని, 4వ తేదీ ఉదయం 5 గంటలకు లెక్కింపు సి బ్బందిని టేబుల్స్ వారీగా ర్యాండమైజేషన్ మేరకు కేటాయింపు జరుగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లు ఆ సమయానికి రావచ్చని, 6 గంటలకు స్ర్టాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. లెక్కింపు కేంద్రంలో ఈవీఎంల లెక్కింపునకు 14, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 4 టేబుల్స్ ఏర్పాటు చేశామని, లెక్కింపు ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయబడుతుందన్నారు. సమావేశంలో ఏఆర్‌ఓలు వెంకటలక్ష్మి, ప్రదీప్ కుమార్, భీమరాజు, సూపరింటెండెంట్ పద్మనాభరావు, తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు.