కాపు రిజర్వేషన్లు అమలు కాకుండా జగన్‌రెడ్డి ద్రోహం: ప్రత్తిపాటి
ABN , Publish Date - May 12 , 2024 | 01:36 AM
రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి, వారిని అన్నివిధాల అణగదొక్కిన ద్రోహి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మాజీమంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ధ్వజమెత్తారు.

చిలకలూరిపేట, మే 11: రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి, వారిని అన్నివిధాల అణగదొక్కిన ద్రోహి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మాజీమంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ధ్వజమెత్తారు. స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజే్‌షనాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి, విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్‌పర్సన్ రుద్రమదేవి హాజరయ్యారు. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలలో 5శాతం కాపులకు ఇేస్త వారు ఎక్కడ ఎదిగిపోతారో అన్న అసూయ, ద్వేషంతో జగన్‌రెడ్డి దానిని తుంగలోకి తొక్కారని, ఇప్పుడు అతడి ప్రభుత్వాన్ని, పార్టీని భూమిలోకి తొక్కడానికి కాపులంతా సిద్థంగా ఉన్నారని ప్రత్తిపాటి అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు ఏటా రూ.వెయ్యి కోట్లు, విదేశీ విద్య అమలుకు ఒక్కొక్క విద్యార్థికి రూ.10 లక్షలు మంజూరు, కాపులకు 500 సామాజిక భవనాలు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల గడిచిన ఐదేళ్లలో కాపు యువత 30వేల ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనేసన సమన్వయకర్త తోట రాజారమేష్, కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.