Share News

నేతల చెప్పు చేతల్లో జిల్లా అధికారులు

ABN , Publish Date - May 26 , 2024 | 12:56 AM

పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి గా అపహాస్యంపా లు కావటానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు పల్నాడు జిల్లా పూర్వపు కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకరరెడ్డి, ప్రస్తుత జేసీ శ్యాం ప్రసాద్‌, డీపీఓ విజయ భాస్కరరెడ్డి ముఖ్య కారకులని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వ జమెత్తారు.

నేతల చెప్పు చేతల్లో జిల్లా అధికారులు

గుంటూరు, మే 25(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి గా అపహాస్యంపా లు కావటానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు పల్నాడు జిల్లా పూర్వపు కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకరరెడ్డి, ప్రస్తుత జేసీ శ్యాం ప్రసాద్‌, డీపీఓ విజయ భాస్కరరెడ్డి ముఖ్య కారకులని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వ జమెత్తారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాచర్ల, గురజాల, నరసరావుపే ట నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల రక్షణలో ఎన్నికలు జరపాలని టీడీపీ ఎంత మొత్తుకున్నా ఎస్‌ఈసీ పట్టించుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి తొత్తుగా వ్యవహరించిన మాచర్ల ఆర్‌ఓ శ్యాం ప్రసాద్‌ను ఇంతవరకు సస్పెండ్‌ చేయక పోవటానికి కారణమేమిటని ప్రశ్నించారు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఈవీఎంను ధ్వంసం చేస్తే వెబ్‌ కాస్టింగ్‌ ఇనచార్జిగా ఉన్న డీపీవో భాస్క రరెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాడని నిలదీశారు. జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్‌కు పాల్వాయి గేటు ప్రజలు పరిస్థిని తెలియజేసినా ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డి చెప్పుచేతల్లో కొంద రు పోలీసు అధికారులు బందీలుగా మారి ఘోరమైన నేరాలకు కారణమయ్యా రని మండిపడ్డారు. ఎస్పీ రవిశంకరరెడ్డి ఎన్నికల నోటిఫికేషనకు ముందే, పల్నాడులో వైసీపీకి అనుకూలమైన పోలీసు అధికారులను నియమించి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వారిని చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. ఎన్నికలకు ముందు ఎస్పీని మార్చినంత మాత్రాన ఒరిగిందేమి లేదన్నారు. వైసీపీ గుండాల చేతిలో టీడీపీకి చెందిన 70 మంది గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - May 26 , 2024 | 12:56 AM