Share News

ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - May 15 , 2024 | 12:22 AM

తె నాలికి చెందిన ఓటరు సు ధాకర్‌పై విచక్షణా రహితం గా దాడిచేసి తీవ్రంగా గా యపరచిన ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌, అతని అనుచరులపై హత్యాయ త్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహ క కార్యదర్శి కనపర్తి శ్రీని వాసరావు డిమాండ్‌ చేశా రు.

ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
బాధితుడిని పరామర్శిస్తున్న కనపర్తి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు

గుంటూరు, మే 14(ఆంధ్రజ్యోతి): తె నాలికి చెందిన ఓటరు సు ధాకర్‌పై విచక్షణా రహితం గా దాడిచేసి తీవ్రంగా గా యపరచిన ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌, అతని అనుచరులపై హత్యాయ త్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహ క కార్యదర్శి కనపర్తి శ్రీని వాసరావు డిమాండ్‌ చేశా రు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మంగళవారం ఆయన పరా మర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంజాయిమూ కతో మూకుమ్మడిగా పోలింగ్‌బూతులోకి ప్రవేశించటమేకాక అదేమని ప్రశ్నిం చిన ఓటరుపై దాడికి పాల్పడడం అత్యంత అమానుషమని అన్నారు. ఎంతో మంది ప్రముఖులు గంటల తరబడి క్యూలో నిలబడి ఓటు వేస్తుంటే, అవినీతి ఎమ్మెల్యే అన్నాబత్తునికి ఉన్న ప్రత్యేకతేమిటో అర్ధం కావట్లేదన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడిన నిందితులను వదిలేసి, బాధితుడిని నాలుగు గంటలపాటు పోలీసుస్టేషన్లోనే నిర్బంధించటమేమిటని ప్రశ్నించారు. ఆకురౌడీలుగా పేరుగాంచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి లాంటివారంతా ఓటమి భయంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించారని కనపర్తి అన్నారు. బాధితుడిని పరామర్శించిన వారిలో కార్పొరేటర్‌ కొమ్మినేని కోటేశ్వరరావు తదితరులు వున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:22 AM