Share News

కనీస వేతనం కలేనా?

ABN , Publish Date - May 25 , 2024 | 12:31 AM

పదకొండేళ్ల క్రితానికి ఇప్పటికి ధరల్లో పెరు గుదల ఉంది.. అద్దెలు పెరిగాయి.. జీవన వ్యయం పెరిగింది.. కానీ కార్మికుల వేతనా లు మాత్రం అలాగే ఉన్నాయి. పదకొండేళ్ల క్రితం నిర్ణయించిన వేతనాలతోనే ఇప్పటికీ కనాకష్టంగా వారి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పేదలు.. వారి అభ్యున్నతే మా ధ్యేయం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్‌ ప్రభుత్వం కనీస వేతనాల గురించే ఐదేళ్లుగా పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభు త్వంలో కనీస వేతనాలకు సం బంధించిన ఏర్పాటు చేసిన సలహా మండ లి సిఫార్సులను కూడా జగన్‌ బుట్టదాఖలు చేశారు. ధరలకు అను గుణంగా వేతనాలు పెరగక కష్టజీవులు శ్రమదోపిడీకి గురవు తున్నారు. అప్పుల పాలై ఆకలి పస్తులతో అల్లాడి పోతున్నారు. ఐదేళ్లుగా పెరిగిన ధర లు, ఛార్జీలు.. అరకొర వేతనాలతో సంఘ టిత, అసంఘటిత రంగ కార్మిక కుటుంబా లు కనాకష్టంగా జీవనం సాగించాయి. తీవ్ర శ్రమదోపిడీకి, అన్యా యానికి గురవుతున్నా పాలకులు పట్టించుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు.

గుంటూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం కలగా మారింది. దాదాపు 11 ఏళ్ల క్రితం 2013లో నిర్ణయిం చిన కనీస వేతనమే నేటికీ అధికారిక కనీస వేతనం గా కొనసాగుతోంది. దీంతో కష్టజీవులు తీవ్ర శ్రమ దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో నిత్యావసర సరుకులు, సేవల ధరలు 200 నుంచి 300 శాతానికి మించి పెరిగినా కార్మి కుల వేతనాలు మాత్రం 10శాతం కూడా పెరుగు దల కనిపించడంలేదు. కార్మికుల కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించడమే అందుకు కారణం. 2013 తరువాత కనీస వేతన సవరణ జరగ్గా, 2018 నాటికి ఐదేళ్లు పూర్తి కావస్తుండడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వేతన సవరణపై కసరత్తు ప్రారంభించింది. పెరుగు తున్న ధరలు, జీవన ప్రమాణాల ఆధారంగా వేతన సవరణకు సంబంధించి నివేదికను సిద్ధం చేయాలని సలహా మండలిని ఆదేశించింది. అప్పటి వేతన సలహా మండలి చైర్మన్‌ రఘుపతుల రామ్మోహన్‌ రావు నేతృత్వంలోని బృందం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన నిర్వహించి కార్మికులు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సం దర్భంగా కనీస వేతనాన్ని 21 వేలుగా నిర్ణయించాల ని కార్మిక సంఘాలన్నీ డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల ను, వారి డిమాండ్లను నమోదు చేసి సలహా సం ఘం నివేదికను సిద్ధం చేసింది. సరిగ్గా అదే సమ యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో మొత్తం ప్రక్రియ అంతా ఆగిపోయింది.

బుట్టదాఖలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం

2019 ఎన్నికల్లో నెగ్గిన వైసీపీ అధికారం చేపట్ట డంతో కనీస వేతన సవరణకు ముసలం వచ్చింది. కనీస వేతన సలహా మండలి నివేదికను బుట్టదాఖలు చేసింది. ఆ తర్వా త వైసీపీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన బర్రె లీలను వేతన సవరణ బోర్డుకు చైర్మన్‌ చేసినప్పటికీ ఈ ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కనీస వేతన సవరణ సలహా బోర్డు ఉందా లేదా అన్నంతగా ఈ బోర్డు సుప్త చేతనా వస్థలో పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. వేతన సవరణ తనకు సంబంధం లేని విషయమే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది.

17 లక్షల మంది ఎదురు చూపులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 లక్షల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరంతా వ్యవసాయం, అనుబంధ రంగాలైన దాదాపు 48 రకాల షెడ్యూల్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వాటితో పాటు అసంఘటిత కార్మికులు నిర్మాణ కార్మికులుగా, సున్నం, ఇటుక బట్టీల్లో, షాపింగ్‌ కాంప్లెక్సులు, దుకా ణాలు, ప్రైవేటు కంపెనీల్లో, ఆస్పత్రు ల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి చట్టపరమైన భద్రత, వేతన భరోసా లేని వీరికి అన్యాయం జరగకుండా, పెరుగుతున్న నిత్యా వసర ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించేందుకు వేతన సవరణ సలహా బోర్డు ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి సల హాలు, సూచనలు ఇ స్తుంటుంది. కాగా ఏడేళ్ల క్రితం మొ దలైన వేతన సవర ణ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది.

నిద్రావస్థలో

కార్మిక శాఖ

కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్మికశాఖ నిద్రా వస్థలో మునిగిపోయింది. కార్మికులకు కనీస వేతనం దక్కక శ్రమదోపిడీకి గురవుతున్నా కార్మిక శాఖ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మి కుల తరపున వేతన సవరణ బోర్డుకు సమస్యను నివేదించడంగాని, అధికారులపై ఒత్తిడి తేవడంగాని చేయడం లేదు. వేతన సవరణ బోర్డు నిర్లక్ష్యం, కార్మిక శాఖ నిస్తేజం జిల్లాలో 17 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయానికి గురవుతు న్నారు. ఇప్పటికీ గతంలో నిర్ణయించిన రూ.14 వేలే అధికారిక కనీస వేతనంగా కొనసాగుతుం డడంతో వీరికి శ్రమ ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కనీస వేతన సవరణపై కష్టజీవుల నుంచి తీవ్ర ఒత్తి డి వస్తోంది. తక్షణం కనీస వేతనాన్ని రూ.21 వేలకు పెంచాల ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 25 , 2024 | 12:31 AM