Share News

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:42 AM

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి.

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌
రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరన్స్‌ పనులు సాగుతున్న దృశ్యం

వందకు పైగా జేసీబీలతో శరవేగంగా పనులు

తుళ్లూరు, జూన్‌ 9: రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి. రాత్రిళ్లు కూడా యంత్రాలు పనులు చేస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ ్లను నిర్మాణం చేయటానికి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. అవి వివిధ దశలలోకి వచ్చాయి. ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పనులు ఆగిపోయాయి. ఆయా రోడ్డు వెంట ముళ్లపొదళ్లను యంత్రాలు తొలగిస్తున్నాయి. ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు చేయటానికి సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఆదివారం రాజధానిలో భవన నిర్మాణాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ పరిశీలించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. స్ట్రీట్‌ లైట్లు రాజధానిలో వెలుగులు జిమ్మాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్‌-5జోన్‌ను క్రియేట్‌ చేసి మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛినం చేయటానకి ప్రయత్నించింది. దానిని రైతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకున్నారు. దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని సీఎస్‌ పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు సీఎస్‌తో పాటు ఉన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 12:42 AM