Share News

నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు

ABN , Publish Date - May 12 , 2024 | 01:01 AM

కేంద్ర ప్రభుత్వం పంపిన వేల కోట్ల రూపాయల ను రాష్ట్రం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధుల్లేక కొట్టు మిట్టాడుతున్నాయని పంచాయతీరాజ్‌ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు జాస్టి వీరాం జనేయులు అన్నారు.

నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు
సమావేశంలో పాల్గొన్న జాస్తి వీరాంజనేయులు

దుగ్గిరాల, మే 11: కేంద్ర ప్రభుత్వం పంపిన వేల కోట్ల రూపాయల ను రాష్ట్రం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధుల్లేక కొట్టు మిట్టాడుతున్నాయని పంచాయతీరాజ్‌ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు జాస్టి వీరాం జనేయులు అన్నారు. మండలంలోని కేఆర్‌కొండూరులోని కనకపుట్టలమ్మ తల్లి ఆలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పెమ్మ సాని చంద్రశేఖర్‌, నారా లోకేశల విజయాన్ని కాంక్షిస్తూ పూజలు నిర్వ హించారు. అనంతరం వీరాంజ నేయులు మీడియాతో మాట్లాడుతూ విద్యుత బకాయిల పేరుతో రాష్ట్రప్రభుత్వం విద్యుతశాఖకు చెల్లిస్తుంద న్నారు. 42రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిన రూ.998.82 కోట్లు నేటికి గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిందన్నారు. సీఈవో ఆదేశాలిచ్చినప్ప టికీ, ఫలితం లేకపోయందని, తాగునీటి సమస్య, గ్రీన అంబాసిడర్‌లు, కార్మికుల వేతనాలు తదితర సమస్యలతో గ్రామ పంచాయతీలు సత మతమ వుతున్నాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ మూడు ముక్క లాటతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు, నియో జకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేశలకు అఖండ విజయం చేకూర్చా లన్నారు. వెలివెల శ్రీనివాసరావు, పిరాట్ల పిచ్చిబాబు, ఆళ్ల సాంబశివ రావు, జాస్తి అమరశేషేంద్ర, జనసేన నాయకుడు కమ్మెల శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:01 AM