వేధింపుల కేసులో హైకోర్టు న్యాయవాదికి మూడేళ్ళ జైలు, రూ.10వేల జరిమానా
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:28 PM
భార్యను మానసికంగా, శారీరకంగా వేధించిన కేసులో హైకోర్టు న్యాయవా దికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి సీహెచ్‌వీ రామకృష్ణ శుక్రవారం తీర్పు చెప్పా రు.

మంగళగిరి, జులై 5: భార్యను మానసికంగా, శారీరకంగా వేధించిన కేసులో హైకోర్టు న్యాయవా దికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి సీహెచ్‌వీ రామకృష్ణ శుక్రవారం తీర్పు చెప్పా రు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ నాగమణి కథనం ప్రకారం.. ఫిర్యాది అనంతపురానికి చెందిన దేవాంగ ప్రశాంతికి అనంతపురానికి చెందిన నిమ్మల ప్రేమరాజ్‌తో 2002లో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు సంతానం. ప్రశాంతి తొలుత హిందూపూర్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి త దుపరి ఏపీ సచివాలయంలో 2005నుండి ప్రస్తు తం వెలగపూడి సచివాల యంలో ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అనంతరం రాష్ట్రం విడిపోయాక తాడేపల్లి మండలం కుంచనప ల్లి విచ్చేసి నివాసం ఉంటున్నారు. ఆమెను భర్త ప్రేమరాజ్ నిత్యం మానసికంగా, శారీరకంగా వేధి స్తూ ఇబ్బందులపాలు చేస్తున్నాడని ప్రాణభయం ఉందని ఆరోపిస్తూ 2016లో గుంటూరు నగరం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో ఎస్‌ఐ సుబ్బారావు క్రైమ్ నెం.142/2018 అండర్ సెక్షన్ 498ఎ 506 ఐపీసీ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు ఇటీవల మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో విచారణ కు రాగా వాదోపవాదాల అనంతరం ఫిర్యాది భర్త, న్యాయవాది ప్రేమరాజ్‌కు మూడేళ్ళ కఠిన కారాగా ర శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయ మూర్తి రామకృష్ణ తీర్పు చెప్పారు. డీఎస్పీ రమేష్ కుమార్ చార్జిషీటు ఫైల్ చేశారు. ఏపీపీ ఎన్ నాగమణి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.