ప్రచారం ముగింపు సందర్భంగా జీవీ భారీ రోడ్‌షో
ABN , Publish Date - May 12 , 2024 | 01:42 AM
ఎన్డీఏ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు పట్టణంలో తనతోపాటు ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయులు విజయాన్ని ఆకాంక్షిస్తూ పట్టణంలో కార్యకర్తల ఉత్సాహం నడుమ భారీ రోడ్‌షో నిర్వహించారు.

- ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు
వినుకొండ, మే 11: ఎన్డీఏ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు పట్టణంలో తనతోపాటు ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయులు విజయాన్ని ఆకాంక్షిస్తూ పట్టణంలో కార్యకర్తల ఉత్సాహం నడుమ భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో కార్యక్రమానికి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జీవీకి మద్దతుగా నిలిచారు. జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు నిశంకర శ్రీనివాసరావు, నాగ శ్రీను, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీమ్, పట్టణ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్, యువనాయకులు లగడపాటి శ్రీనుతో పాటు పలువురు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీతోపాటు మక్కెన మాట్లాడుతూ వినుకొండ అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటువేసి జీవీ ఆంజనేయులతోపాటు ఎంపీ కృష్ణదేవరాయలును అఖండ మెజార్టీతో గెలిపించాలని మక్కెన ప్రధాన కూడళ్ళ వద్ద ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లీలావతి ప్రచారం
వినుకొడటౌన్, మే 11: పట్టణంలోని 2, 3 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఉప్పరపాలెంలో గోనుగుంట్ల లీలావతితోపాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఫ తుమ్మలకుంట (శావల్యాపురం), మే 11: మండలంలోని కొత్తలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తుమ్మలకుంట గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు టీడీపీ మండలాధ్యక్షుడు, కొత్తలూరు ఉపసర్పంచ్ గుంటూరు సాంబశివరావు ఆధ్వర్యంలో శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.