టీడీపీ విజయం ఖాయం
ABN , Publish Date - May 12 , 2024 | 01:02 AM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం తఽథ్యమని టీడీపీ వాణిజ్యవిభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రా వు అన్నారు.

దుగ్గిరాల, మే 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం తఽథ్యమని టీడీపీ వాణిజ్యవిభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రా వు అన్నారు. దుగ్గిరాలలో టీడీపీ నాయకులు మహిళలు, ర్యాలీ శనివారం నిర్వ హించారు. ఆలీనగర్ జెండాచెట్టు వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయినరోడ్, రైలు పేట, చెన్నకేశనగర్, అంబేద్కర్‌నగర్, రామ్‌నగర్‌ల మీదుగా ముర్తుజానగర్ జెండాచెట్టు, యాదవపాలెంలో మీదుగా లైబ్రరీ వరకూ కొనసాగింది. ర్యాలీ అనంతరం వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం లో నారా లోకేశ, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌రావు విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. రానున్న కొద్ది గంటల్లో ప్రజలంతా అన్ని రకాలుగా ఆలోచించి మనకు అన్నివిధాలా మేలు చేసే వ్యక్తులైన చంద్రశేఖర రావు, లోకేశలకు అఖండ విజయం చేకూర్చాలన్నారు. తమకు అన్నివిధాలుగా సహకరించిన జనసేన, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఎన్డీఏ కూటమి విజయం రాష్ట్రంలో లాంఛనమని అన్నారు. వల్లూరు నరసింహా రావు, ఎన్నారై జంపాల సుబ్బారావు, నిమ్మగడ్డ వెంకటరమణ, మాజీ ఎంపీపీ ఉన్నం ఝాన్సీరాణి, రవియాదవ్, గద్దె వాసు, దేవరపల్లి చంటి, కాకా బాబు, నాయుడు బాబూరావు, ఉన్నం బాబూరావు, లంకా ఫణి సోదరులు, కీర్తి పవన, లియాఖత, ఖురేషి, సాదిక్, కరీముల్లా, జంపాల రాజేశ్వరి, కవిత, గద్దె శివ కుమారి, గూడూరు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.