ప్రజల సంకల్పంతోనే ఎన్డీయే కూటమి ఘన విజయం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:15 AM
ప్రజ ల సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిం దని గుంటూరు పశ్చి మ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు.

గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రజ ల సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిం దని గుంటూరు పశ్చి మ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని పొంది అధికారంలోకి రావడంతో నియోజకవర్గం 33వ డివి జనకు చెందిన టీడీపీ నేత పారెళ్ళ బసవేశ్వరరావు గుంటూరు బ్రాడీపేట నుంచి మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు విజయోత్సవ పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రను ఎమ్మెల్యే గళ్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకో మనస్తత్వం కలిగిన జగనరెడ్డిని గద్దె దింపటానికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గట్టి సంకల్పం తీసుకోవటం వల్లే చంద్రబాబు వంటి దార్శనికు డు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. పాదయాత్ర చేపట్టిన నేతలను ఆమె అభినందిం చారు. కార్యక్రమంలో పోపూరి నరేంద్ర, ఈరంటి వరప్రసాద్, చింతకాయల శివ, వినోద్, నాగరాజు, డేగల శ్రీను, ప్రశాంత, గోపి తదితరులు పాల్గొన్నారు.