ఆశీర్వదించండి.. పశ్చిమ ప్రజల రుణం తీర్చుకుంటా
ABN , Publish Date - May 12 , 2024 | 12:41 AM
మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి కోరారు.

గుంటూరు, మే 11(ఆంధ్రజ్యోతి): మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి కోరారు. గుంటూ రు 36వ డివిజన బంజారా కాలనీలో శనివారం ఆమె ఎస్టీలతో ఆత్మీ య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమలో ఈసారి జరగబోతున్న ఎన్నికలు అత్యంత కీలక మని, కుళ్ళు, కుతంత్రాలతో ప్రజల రక్తాన్ని డబ్బుల రూపంలో పీల్చే జలగ మాదిరి వైసీపీ అభ్యర్థి పోటీలో ఉన్నదని హెచ్చరించారు. మాయమాటలతో, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి గెలవాలని చూసే వైసీపీ అభ్యర్థి రజినికి ఓటు వేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చిలకలూరిపేట ప్రజలను చూసిన ప్రపంచానికి తెలుసన్నారు. ప్రజలనే నమ్ముకొని తాను ముందుకు వచ్చానని, వైసీపీ నేతలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా, అభివృద్ధి, సంక్షేమం, రక్షణ కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించా లని కోరారు. నియోజకవర్గం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా తాను పని చేసి తీరుతానని గళ్లా మాధవి హామినిచ్చారు.