Share News

టీబీ ముక్త భారత లక్ష్యసాధనకు కృషి చేద్దాం

ABN , Publish Date - May 29 , 2024 | 12:56 AM

దేశం నుంచి టీబీని పారదోలేందుకు టీబీ ముక్త భారత లక్ష్య సాధనకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కే.విజయలక్ష్మి కోరారు.

టీబీ ముక్త భారత లక్ష్యసాధనకు కృషి చేద్దాం

గుంటూరు (మెడికల్‌) మే 28 : దేశం నుంచి టీబీని పారదోలేందుకు టీబీ ముక్త భారత లక్ష్య సాధనకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కే.విజయలక్ష్మి కోరారు. తన ఛాంబర్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీబీ ముక్త భారత అభియా న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మే 16వ తేదీ నుంచి అడల్ట్‌ బీసీజీ వ్యాక్సి నేషన ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయాల్లో ఆరో గ్య సిబ్బంది వయోజనులకు బీసీజీ వ్యాక్సిన ఇస్తారని ఆమె వివరించారు. జిల్లాలో 5,83,604 మందికి వ్యాక్సినేషన చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీఎంహెచవో డాక్టర్‌ విజయలక్ష్మి ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన వారు, ధూమపానం చేసే వారు, గత ఐదేళ్లల్లో టీబీ బారిన పడిన వారు, మధుమేహ రోగులు, గత నాలుగేళ్లు కాలంలో టీబీ రోగులతో సన్నిహితగా ఉన్న వారు, బీఎంఐ 18 కంటే తక్కువగా ఉన్న వారు బీసీజీ వ్యాక్సినేషన చేయించుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - May 29 , 2024 | 12:56 AM