Share News

దివ్యాంగులకు చేయూత

ABN , Publish Date - May 23 , 2024 | 01:05 AM

ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన వారికి మంగళగిరి రోటరీ క్లబ్‌ చేయూతనందిస్తుంది. జర్మనీకి చెందిన ది హ్యాండ్‌ ప్రాజెక్టు, మంగళగిరి రోటరీ కరవాలంబన ట్రస్టు సంయుక్త భాగస్వామ్యం తో మూడు రోజుల నుంచి మంగళకరం పేరిట దివ్యాంగ లబ్ధిదారులకు జెమ్‌ ఎంకే-1 హ్యాండ్స్‌ ఉచితంగా అందజేస్తున్నారు.

 దివ్యాంగులకు చేయూత

మంగళగిరి సిటీ, మే 22: ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన వారికి మంగళగిరి రోటరీ క్లబ్‌ చేయూతనందిస్తుంది. జర్మనీకి చెందిన ది హ్యాండ్‌ ప్రాజెక్టు, మంగళగిరి రోటరీ కరవాలంబన ట్రస్టు సంయుక్త భాగస్వామ్యం తో మూడు రోజుల నుంచి మంగళకరం పేరిట దివ్యాంగ లబ్ధిదారులకు జెమ్‌ ఎంకే-1 హ్యాండ్స్‌ ఉచితంగా అందజేస్తున్నారు. మంగళగిరి వీటీజేఎం అండ్‌ ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాలలో వారం రోజులపాటు కొనసాగే ఈ శిబిరంలో ఇప్పటివరకు 71 మందికి కృత్రిమ చేతులను అమర్చారు. ది హ్యాండ్‌ సంస్థ వ్యవ స్థాపకులు క్రిస్‌ గల్లి (జెర్మనీ) బృందం కృత్రిమ చేతులను అమరుస్తుంది. ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి చేతులు కోల్పోయిన దివ్యాంగులు ఇక్కడికి తరలివస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది బాధితులు శిబిరానికి విచ్చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యుదాఘాతం వల్ల చేతులు కోల్పోయినట్టు చెబు తున్నారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌ జిల్లా పరిగి మండలానికి చెంది న ఓ బాలుడి దీనస్థితి అందరినీ కలచివేసింది. సుమారు 13 సంవత్సరాల వయస్సు ఉన్న షమీ స్నేహితుడిని కాపాడబోయి రెండు చేతులు పూర్తిగా కోల్పోయాడు. షమీ తన స్నేహితుడు జహీర్‌తో కలిసి 2019, డిసెంబరు 8వ తేదీన గాలిపటం ఎగురవేస్తుండగా అది 11 కేవీ హైటెన్షన్‌ వైరుకు చుట్టుకుంది. జహీర్‌ ఇనుప రాడ్డుతో గాలిపటాన్ని తీస్తూ విద్యుదాఘా తానికి గురయ్యాడు. అతన్ని రక్షించబోయిన షమీ సైతం తీవ్రమైన విద్యు త్‌షాక్‌కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో జహీర్‌ ప్రాణాలు కోల్పోగా షమీ కోమాలోకి వెళ్లాడు. 22 రోజుల తరువాత తేరుకోగా అప్పటికే రెండు చేతు లూ కోల్పోయి అచేతనుడయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో రోటరీ క్లబ్‌ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ గురించి సమాచారం తెలుసుకుని షమీ తన తండ్రి రఫిక్‌ పాషాతో కలిసి మంగళగిరి వచ్చాడు. జర్మనీ బృందం షమీ పరిస్థితిని వాకబు చేసి చలించిపోయారు. ఆ దివ్యాంగ చిన్నారికి రెండు కృత్రిమ చేతులను అమర్చి ధైర్యం చెప్పారు. కాగా మరో నాలుగు రోజులపాటు జరిగే ఈ శిబిరంలో 300 మంది దివ్యాంగులకు చేతులను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రోటరీ క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు అందె రేవంత్‌, ప్రాజెక్టు చైర్మన్‌ అనిల్‌ చక్రవర్తి, ప్రతినిధులు నూతలపాటి వెంకటేశ్వరరావు, అందె మురళీ, రావెల శ్రీనివాసరావు, ప్రగడ రాజశేఖర్‌, చనుమోలు గోపాల్‌, కే.సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 01:05 AM