కమిషనర్ భార్య.. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:07 AM
ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కేవలం పేదప్రజలే వైద్యసేవలు పొందుతారనేది నానుడి. ఎంతోకొంత ఆర్ధిక స్థోమత ఉన్నవారంతా ప్రైవేటు వైద్యశాలలోనే చికిత్స పొందటానికి ఇష్టపడుతుంటారు.
బాపట్ల, జూన్ 29: ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కేవలం పేదప్రజలే వైద్యసేవలు పొందుతారనేది నానుడి. ఎంతోకొంత ఆర్ధిక స్థోమత ఉన్నవారంతా ప్రైవేటు వైద్యశాలలోనే చికిత్స పొందటానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కాదంటూ అందరికి ప్రభుత్వ వైద్యశాలలో మంచి వైద్యం అందుతుందని బాపట్ల మున్సిపల్ కమీషనర్ బి.శ్రీకాంత్ తన భార్యకు ఏరియావైద్యశాలలో కాన్పు చేయించి ఆదర్శంగా నిలిచారు. ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దార్ద పర్యవేక్షణలో వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి సిబ్బందితో కలిసి కమీషనర్ భార్యకు కాన్పు చేశారు. ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేవిధంగా కమీషనర్ అనుసరించిన విధానాన్ని అందరు హర్షిస్తున్నారు.