Share News

దిగుబడి పేరిట.. దగా

ABN , Publish Date - May 25 , 2024 | 12:33 AM

అధి కార యంత్రాంగం ఎన్నికల హడావుడిలో ఉం డగా.. పొరుగు రాష్ర్టాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను వ్యాపారులు తెప్పించేశారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు నకిలీ విత్తనాల ముప్పు పొంచి ఉంది. గుజరాత్‌ రాష్ట్రంతో పాటు కర్నూలు, నంద్యాల నుంచి వీటిని తీసుకువ చ్చినట్లు తెలుస్తోంది.

దిగుబడి పేరిట.. దగా

గుంటూరు సిటీ, దాచేపల్లి, మే 24: అధి కార యంత్రాంగం ఎన్నికల హడావుడిలో ఉం డగా.. పొరుగు రాష్ర్టాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను వ్యాపారులు తెప్పించేశారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు నకిలీ విత్తనాల ముప్పు పొంచి ఉంది. గుజరాత్‌ రాష్ట్రంతో పాటు కర్నూలు, నంద్యాల నుంచి వీటిని తీసుకువ చ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న విత్తనాల డీలర్లు వద్ద బీటీ-3 నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు తెలు స్తోంది. నేలకు అత్యంత హాని కలగజేసే ఈ విత్తనాలను గ్రామాల్లో రహస్యంగా నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచా రం. హైబ్రిడ్‌ చిల్లీ విత్తనాలు కూడా భారీగానే దిగుమతి అయినట్లు తెలుస్తోంది. బీటీ-3 పత్తి విత్తనాల వినియోగం వల్ల భూమి సా రాన్ని కోల్పోతుంది. దీర్ఘకాలికంగా రైతుల కు తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్లే ప్రభుత్వం ఈ విత్తనాలపై నిషేధం విధించిం ది. డీలర్లు రైతుల్లో ఉన్న నిరక్షరాస్యతను ఆధారం చేసు కుని అంటగడుతున్నారు. అధిక దిగుబడి వస్తుందని, తెగుళ్ల బెడద ఉండదని చెప్తున్నా రు. దీంతో రైతులు అధిక ధరకు నిషేధిత పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

రూ.8 వేలకు కొని

రూ.80 వేలకు విక్రయం

రాణీ బెంగళూరు హైబ్రిడ్‌ చిల్లీ విత్తనాలు పెద్దఎత్తున జిల్లాకు చేరుతున్నాయి. బెంగళూ రులో ప్రముఖ కంపెనీల నుంచి లాట్‌ ఫెయి ల్‌ విత్తనాలను కొనుగోలు చేస్తారు. వీటిని కేజీ రూ.8 వేల వరకు వెచ్చించి కొంటారు. వాటిని గుంటూరుకు తీసుకువచ్చి నకిలీ ప్యాకింగ్‌ చేసి కేజీ రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు విక్రయిస్తారు. బీటీ-3 పేరుతో కూడా రైతులను కొందరు డీలర్లు మోసం చేస్తున్నారు. గుంటూరు ఆటోనగర్‌, బైపాస్‌రోడ్డు, మాంచెష్టర్‌ రోడ్డుల్లోని మిల్లు ల్లో విత్తనాలను శుద్ధి చేసి కంపెనీల పేరుతో ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు. ముందుటేడు బాగా పండిన విత్తనాలను సేకరించి శుద్ధి, రసాయన ప్రక్రియతో కొద్ది రోజులు ఎండబెట్టి ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. కాపు కాయని విత్తనాలు ఈ రీతిగా తయారైనవే.

అధికారులకు సంబంధాలు

కొందరు వ్యవసాయ అధికారులకు విత్తన సంస్థలతో మంచి సంబంధాలు, వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికంగా దాడులు జరిగి నకిలీ విత్తనాలు పట్టుబడినా విక్రేతలు సులువుగా తప్పించుకుంటున్నారన్న వాదన ఉంది. విత్త నాల వ్యాపారంలో అధికారుల పాత్ర ఉన్నం దు వల్ల తనిఖీలు, దాడులు కూడా తక్కు వగా జరుగుతుంటాయన్న ఆరోపణ లున్నాయి.

బీటీ-3

విత్తనాలు స్వాధీనం

హైదరాబాద్‌ నుంచి గుంటూరు కు బీటీ-3 విత్తనాలను సరఫరా చేస్తుం డగా సైబరాబాద్‌ పోలీసులు సుమారు 240 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. గుం టూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన బొర్రా శంకర్రావు, ఎం ఉదయ్‌కిరణ్‌ హైదరాబాద్‌లోని శంకర్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి నుంచి వీటిని కొనుగోలు చేసి గుంటూరు తరలిస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విత్తనా లు, పెస్టిసైడ్స్‌ షాపులపై గుంటూరు విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. వ్యవసాయ శాఖ నుంచి అను మతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న సాక్షి గణపతి పెస్టిసైడ్స్‌ షాపుపై కేసు నమోదు చేశారు. రూ.2 లక్షలు విలువ చేసే 240 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వరసిద్ధి వినాయక పెస్టిసైడ్స్‌ షాపులో ప్రిన్సిపల్‌ సర్టిఫికేట్‌ లేకుండానే పురుగు మందులను అమ్ముతున్నట్లు గుర్తించి రూ.1.25 లక్షల స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ వ్యవసాయ అధికారి రమణకుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:33 AM