Share News

కౌంటింగ్‌ కేంద్రాలకు.. మూడంచల భద్రత

ABN , Publish Date - May 23 , 2024 | 01:06 AM

కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూ ఇంజనీరిగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 100 మీటర్ల లోపు ఎవరికి అనుమతి లేదని, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాలకు.. మూడంచల భద్రత
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం

- అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలి

- కలెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీ

నరసరావుపేట, మే 22: కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూ ఇంజనీరిగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 100 మీటర్ల లోపు ఎవరికి అనుమతి లేదని, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు తమ కార్యకర్తలకు కూడా సూచించాలని ఆయన కోరారు. జిల్లాలో గుర్తింపుపొందిన ప్రధాన పార్టీలు వారి వారి ఏజెంట్లను నియామకానికి ఫామ్‌- 18 ల ద్వారా రెండు సెట్లను త్వరితగతిని అందించాలన్నారు. ఒక సెట్‌ను పోలీస్‌ డిపార్టుమెంట్‌కు పంపించి విచారించి, ఎటువంటి కేసులు లేనివారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించడం జరుగుతుందన్నారు. జేఎన్టీయూ మెయిన్‌ గేటు వద్ద 24గంటలు పనిచేేసలా పెద్ద స్ర్కీనును ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అన్ని స్ర్టాంగ్‌ రూమ్‌ల నుంచి సీసీ కెమెరాల సర్వైలెన్స్‌ ఉంటుందన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల భద్రత ఇలా..

పోస్టల్‌ బ్యాలెట్లు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి పోలీస్‌ ేస్టషన్లో, చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి చిలకలూరిపేట పోలీస్‌ ేస్టషన్‌లో, నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ట్రెజరీలో, సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి సంబంధిత రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అధీనంలో, వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి వినుకొండ ట్రెజరీలో గురజాల నియోజకవర్గం సంబంధించి పోలీస్‌ ేస్టషన్‌లో అదేవిధంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పోలీస్‌ ేస్టషన్లో భద్రపరచడం జరిగిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లన్నిటిని 3న సాయంత్రం నాలుగు గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ జేఎన్టీయూ కౌంటింగ్‌ సెంటర్‌కు తరలించడం జరుగుతుందన్నారు. రానున్న రెండు రోజులలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని అదేవిధంగా ఈవీఎంల కౌంటింగ్‌ కూడా మొదలవుతుందని ఆయన తెలిపారు. ఈవీఎం లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్లమెంట్‌ నియోజకవర్గానికి 14 టేబుల్‌ల చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుంది, పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ కు అసెంబ్లీ నియోజకవర్గానికి రెండుచొప్పున టేబుల్‌లు మాచర్ల నియోజకవర్గానికి మూడు సత్తెనపల్లి నియోజకవర్గానికి మూడు టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పార్లమెంట్‌ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు 18 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ అనంతరం వెలువడిన ఫలితాలపై ప్రజా తీర్పును గౌరవించి ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 01:07 AM