Share News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 25 , 2024 | 12:41 AM

ఎన్నికల కౌంటింగ్‌ రోజున గానీ, ఆ తరువాత గానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లాలాపేట సీఐ దేవ ప్రభాకర్‌ హెచ్చరించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

గుంటూరు, మే 24 : ఎన్నికల కౌంటింగ్‌ రోజున గానీ, ఆ తరువాత గానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లాలాపేట సీఐ దేవ ప్రభాకర్‌ హెచ్చరించారు. ఆయన స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం స్థానికులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రజలు వ్యవహరించాల్సి తీరును, ఎన్నికల నియమ, నిబంధనలను వారికి వివరించారు. కౌంటింగ్‌ రోజున సెక్షన్‌ 144తో పాటు, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, విజయోత్సవ సంబరాలకు ఎటువంటి అనుమతిలేదన్నారు. ఆయా నిబంధనలు అతిక్రమించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

Updated Date - May 25 , 2024 | 07:57 AM