Share News

శపథం నెగ్గించుకున్న చంద్రబాబు

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:00 AM

‘చంద్రబాబు అంటే అది.. ఎక్కడైతే అవమానపడ్డారో.. అక్కడే సగర్వంగా తలెత్తుకు నిలబడ్డారు.. దటీజ్‌ చంద్రబాబు!’

శపథం నెగ్గించుకున్న చంద్రబాబు

అసెంబ్లీ సాక్షిగా నాడు అవమానం

అదేరోజున అక్కడే చంద్రబాబు శపథం

అన్నమాట ప్రకారమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు

పంతం నెగ్గించుకున్న బాబు పట్ల రైతుల్లో హర్షం

గుంటూరు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు అంటే అది.. ఎక్కడైతే అవమానపడ్డారో.. అక్కడే సగర్వంగా తలెత్తుకు నిలబడ్డారు.. దటీజ్‌ చంద్రబాబు!’ - ఇది రాజధాని రైతుల నోట వినిపిస్తున్న మాట! రాజధాని గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్న మాట! తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి కనీవినీ ఎరుగని రీతిలో అనూహ్య విజయం పొందడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటి చంద్రబాబు శపథమే రాజధాని నిర్మాణానికి శ్రీరామ రక్ష అయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ తలరాతలు మారబోతు న్నాయని వారు సంబరాలు చేసుకుంటున్నారు.

అసెంబ్లీ సాక్షిగా శపథం ..

గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అన్న కనీస గౌరవం లేకుండా చంద్రబాబును తీవ్ర అవమానంపాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిరాఽ దార నిందారోపణలు చేస్తూ, ఆయన సతీమణిని అవమానించ డంతో ఆయన అసెంబ్లీ నుంచి శోకాతప్తుడై బయటకి వచ్చారు. గుండెలు పగిలే ఆవేదనను అదుపు చేసుకోలేక కన్నీరు కార్చారు. బయటకు వచ్చే ముందు కౌరవ సభగా మారిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథంచేశారు. ఆరోజున చంద్ర బాబు కంట కారిన కన్నీరు, ఆయన చేసిన శపథం ప్రజల గుండెలను కదిలించి వేశాయి. ప్రజలంతా ఆయన వెంటే నిలిచారు. ఆయన శపథం నెరవేరేలా చరిత్ర ఎరుగని తీర్పునిచ్చారు. అధికార వైసీపీకి డిపాజిట్లు లేకుండాచేసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకు న్నారు. ఇలాంటి విజయం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని, పడిన చోటే లేచి తలెత్తుకు నిలిచే తత్వం వల్లే ఆయన ఇవ్వాళ ఇంతటి ఘన విజయాన్ని సాధించారని ప్రజలు చెబుతున్నారు. అవమానాల్ని అధిగ మించి ఆత్మస్థైర్యంతో తాను నిలబడడమే కాకుండా, తాను తలపెట్టిన రాజధానిని, తనను నమ్మిన రైతాంగాన్ని కాపాడారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపు చంద్రబాబు గెలుపు మాత్రమే కాదని అది రాజధాని రైతుల, రాష్ట్ర ప్రజల గెలుపని అంటున్నారు.

చంద్రబాబును అవమానంపాలు చేశారు ... సురేంద్ర, అమరావతి అసైన్డ్‌ రైతు

రాజధాని రైతులను వేధించడం, మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా చంద్రబాబును అవమానించడం జగన్‌రెడ్డి చేసిన దిద్దుకోలేని తప్పు. చంద్రబాబును అవమానించడం, ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిని అల్లరిపాలు చేయాలనుకోవ డమే వైసీపీకి శాపంగా మారింది. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.

భువనేశ్వరి శాపం తగిలింది .. కామినేని గోవిందమ్మ

ఏనాడు రాజకీయాల జోలికి రాని చంద్రబాబు సతీమణి భువనేశ్వ రిని వైసీపీ ప్రభుత్వం, జగన్‌ అనుచర గణం అవమానించాలని చూసింది. ఆమె శాపమే వారికి తగిలింది. అందుకే వారికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు.

Updated Date - Jun 11 , 2024 | 01:00 AM