Share News

టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదు

ABN , Publish Date - May 16 , 2024 | 01:17 AM

సాధారణ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం పట్టణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి టీడీపీ నేతలపై ఐదు కేసులు, వైసీపీ నేతలపై రెండు కేసులు పట్టణ పోలీసు స్టేషనలో నమోదయ్యాయి.

టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదు

నరసరావుపేట లీగల్‌, మే 15: సాధారణ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం పట్టణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి టీడీపీ నేతలపై ఐదు కేసులు, వైసీపీ నేతలపై రెండు కేసులు పట్టణ పోలీసు స్టేషనలో నమోదయ్యాయి. టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు, దాడి కేసు, వాహనం ధ్వంసం, దహనం తదితర ఆరోపణలపై డాక్టర్‌ అరవిందబాబు, దేసిరెడ్డి చిన్నపరెడ్డి, బెల్లంకొండ అనీల్‌, సింహాద్రి యాదవ్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు పాలపాడుకు చెందిన కత్తి మహేంద్ర, పట్టణానికి చెందిన గంటెనపాటి గాబ్రియేలులు ఫిర్యాదు మేరకు నమోదయ్యాయి. కాగా వైసీపీ నాయకులపై కారు ధ్వంసం, దహనం తదితర ఆరోపణలపై రెండు కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మక్కెన అంకమరావు ఫిర్యాదుమేరకు ఈ రెండు కేసులు నమోదయ్యాయి. కాగా వైసీపీ నాయకులపై హైదరాబాద్‌కు చెందిన రిపోర్టర్‌ ఎస్‌.పవనకుమార్‌ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు కావాల్సి ఉంది. ఈ మేరకు తాను రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తనపై వైసీపీ వర్గీయులు దాడిచేసి 64వేలు విలువైన సెల్‌ ఫోనను తీసుకున్నట్టు ఫిర్యాదు చేశారు.

Updated Date - May 16 , 2024 | 08:33 AM