Share News

బయోటెక్‌ సిటీగా.. బాపట్ల

ABN , Publish Date - May 11 , 2024 | 12:32 AM

వనరులు సమృద్ధిగా ఉన్న బాపట్లను బయోటెక్‌ సిటీగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు.

బయోటెక్‌ సిటీగా.. బాపట్ల
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్‌

వనరులు సమృద్ధిగా ఉన్నాయి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

బాపట్ల, మే 10: వనరులు సమృద్ధిగా ఉన్న బాపట్లను బయోటెక్‌ సిటీగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. బాపట్ల పట్టణంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ సైబరాబాద్‌ నగరం అభివృద్ధి చేసిన అనుభవాలతో అధినేత నారా చంద్రబాబునాయుడు సహకారంతో బంగారు బాపట్లగా తీర్చిదిద్ది రైతులకు, యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించేందుకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. అమరావతి నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల మీదుగా ప్రపంచ గుర్తింపు లభించే విధంగా కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 35 సంవత్సరాలు ఐపీఎస్‌ అధికారిగా చేసిన అనుభవంతో మాట్లాడుతున్నానని చెప్పారు. బాపట్ల గళాన్ని పార్లమెంట్‌లో వినిపించి ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చేందుకు కావాల్సిన అనుభవం, సంబంధాలు తనకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో 7అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు కృష్ణప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం పూర్తిగా కొరవడిందని దీనిని గాడిలో పెట్టగలిగిన సత్తా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమన్నారు.

నియోజకవర్గంలోని ఏప్రాంతానికి వెళ్ళిన రైతుల సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. మహిళలు పడుతున్న ఇబ్బందులు తెలియజేస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి లేదని యువత ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దీనివల్ల డ్రగ్స్‌, గంజాయి, నాసిరకం మద్యం భారీనపడి యువతరం పెడదోవ పడుతున్నారన్నారు. నాసిరకం మద్యం వల్ల 30లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని 35వేలమంది మృతి చెందారని అన్నారు. యువతరం జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. ప్రభుత్వ విధానాలతో గ్రామీణ ప్రజలు విసిగిపోయారని కృష్ణప్రసాద్‌ తెలిపారు. వాగ్దానాలు చేయటమే తప్ప వాటిని అమలు చేయటంలేదన్నారు.. ఒక ఛాన్స్‌ పేరిట అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రజాసంక్షేమ పాలనందిస్తే వైసీపీ పాలనలో ధరలు పెంచి పేదల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. రాష్ట్రప్రజలు క్షేమంగా ఉండాలన్న యువతకు జాబ్‌ రావాలన్నబాబు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకునేది తెలుసుకున్నానని వారు దౌర్జన్యాలకు దూరంగా సంక్షేమానికి దగ్గరగా ఉండాలని కూటమి వైపు చూస్తున్నట్లు తెలిపారు. టీడీపీలో క్షేమం వైసీపీలో దౌర్జన్యం ప్రజలు గుర్తించారని చెప్పారు. వైసీపీ శ్రేణులు ఓటమి భయంతో తనను నాన్‌లోకల్‌గా ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈస్ట్‌ గోదావరి జిల్లా రాజోలు దగ్గర తెన్నేటి పేటలో పుట్టిన తాను చదువులో, ఉద్యోగంలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తూ వచ్చానని చెప్పారు. అధికారిగా అనేక ప్రాంతాలలో పనిచేశానని అంతమాత్రన నాన్‌లోకల్‌ ఎలా అవుతానని ప్రశ్నించారు? ఓటు వేసి సేవ చేసే బాధ్యత కల్పించాలని నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను కోరుతున్నట్లు తెలిపారు. ఇక్కడ ఓటు వేయించుకొని తాడేపల్లి వెళ్ళిపోనని, అరటితోటలు నరకటం, ఇసుకదోపడి చేయటం వంటివి తనకు చేతకావన్నారు. ప్రజాభిమానం పొందటం వల్లే మూడుసార్లు ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నట్లు కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఎన్నికలలో ఒకసారి గెలిచిన తర్వాత తన ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంచుతానన్నారు. ప్రజల పక్షాన ఉండి పనిచేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో లేకపోవటం కూడా నేరమే అవుతుందన్నారు. ఇప్పటికే అనేక రకాలుగా ప్రజలకు సేవందిస్తున్నానని అది నా స్టయిల్‌ అని కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. భారతదేశం ఆర్ధికంగా ఒకఅప్పుడు 10వ స్థానంలో ఉండేదని ప్రస్తుతం అది 5వస్థానంలోకి వచ్చిందని త్వరలో మూడోవ స్థానంలోకి రాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా దేశంలో ప్రత్యేక స్థానం వస్తుందన్నారు. బ్రహ్మండమైన సేవలందించటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తెలుగు ప్రజల గళం ప్రపంచ దేశాలు చూచేవిధంగా పనిచేస్తానని కృష్ణప్రసాద్‌ తెలిపారు. పోలవరం, అమరావతి అభివృద్దికి కృషి చేస్తానన్నారు. కుటుంబ సభ్యులమంతా కలిసి నియోజకవర్గంలో పనిచేస్తున్నామని ప్రజల ఆధరణ బాగుందని ఎన్నికలలో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాలలో ప్రణాళిక బద్దంగా పరిశ్రమలు అభివృద్ది చేసి ప్రపంచదేశాలు చూచేవిధంగా గర్వించతగ్గ స్థాయికి తీసుకెళుతానని దీనికి ప్రజలంతా మద్దతు తెలియజేయాలని కోరారు.

Updated Date - May 11 , 2024 | 12:32 AM