Share News

బైక్‌లు చోరీ చేస్తున్న నిందితుడి అరెస్టు

ABN , Publish Date - May 30 , 2024 | 12:40 AM

గుంటూరు రైల్వే ేస్టషన్‌ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బైక్‌లు చోరీ చేస్తున్న నిందితుడి అరెస్టు

గుంటూరు, మే 29 : గుంటూరు రైల్వే ేస్టషన్‌ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలకలూరురోడ్‌ లోని రత్నగిరి నగర్‌ కు చెందిన వెలివోలు వెంకటేష్‌ అనే యువకుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జీఆర్పీ ేస్టషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ సీఐ గంగా వెంకటేశ్వర్లు నిందితుడైన వెంకటేష్‌ను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు ఇనచార్జి డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో గుంటూరు జీఆర్పీ ఇన్సపెక్టర్‌ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై పి.రమేష్‌, జి.వెంకటాద్రి వారి సిబ్బందితో కలిసి గుంటూరు రైల్వే ేస్టషన్‌ పరిధిలో వెస్ట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ ఏరియా దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో వెలివోలు వెంకటేష్‌ పోలీసులను చూసి పారిపోతుండగా వెంటబడి పట్టుకున్నారు. వెంకటేష్‌ను విచారించగా చెడు వ్యసనాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాలు దొంగత నం చేసి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు చెప్పాడు. అతని వద్ద నుంచి గుంటూరు రైల్వే పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో నమోదైన కేసులలో రూ.4 లక్షల 20 వేల విలువ గల ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు వెంకటేష్‌పై గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయని, రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై సస్పెక్టెడ్‌ షీట్‌ ఉన్నట్లు సీఐ చెప్పారు.

Updated Date - May 30 , 2024 | 12:40 AM