Share News

విద్యాశాఖలో అవకతవకలపై విచారణ చేయాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:46 AM

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో విద్యాకానుక కిట్ల కొనుగోళ్ళు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖలో అవకతవకలపై విచారణ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల డిమాండ్‌

గుంటూరు(విద్య), జూన్‌ 6: గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో విద్యాకానుక కిట్ల కొనుగోళ్ళు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్‌ చేశారు. గురుకువారం జిల్లా కోర్టు రోడ్డులోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు అధ్యక్షత వహించారు. చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను అనేక, అవమానాలకు, హేళనలకు గురిచేసిం దన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఉద్యమాలు కాదు కాళ్ళు పట్టుకునే నేర్పరితనం ఉండాలంటూ చులకనగా మాట్లాడి చివరికి ఉద్యోగ, ఉపాధ్యాయులు మా దృష్టిలో ఓటర్లే కాదని లెక్కలేనితనంతో మాట్లాడరన్నారు. ఏపీటీఎఫ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ పాఠశాల విద్యారంగానికి గొడ్డలిపెట్టుగా ఉన్న జీఓ 117ను రద్దు చేయాలన్నారు. 3, 4, 5 తరగతులు విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్‌ జిలాని, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ చాంద్‌ బాషా, జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఖాలీద్‌, జిల్లాకమిటీ సభ్యులు పి.నాగశివన్నారాయణ, జనార్థనరావు, లక్ష్మీనారాయణ, సత్యనారాయణమూర్తి, దాస్‌, శ్రీను, బాలరాజు, మరియరాజు, శివరామకృష్ణ, కిషోర్‌షా, ఎన్‌.శ్రీనివాస్‌, వివిధ మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..

Updated Date - Jun 07 , 2024 | 12:47 AM