Share News

ప్రతి అడుగు జీవిత పథాన్ని నిర్ధేశిస్తుంది

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:29 AM

మనిషి ఏది పొందాలన్నా, ఏది సాఽధించాలన్నా అతని చేతుల్లోనే ఉంటుంది. అతను వేసే ప్రతి అడుగు అతని జీవిత పధాన్ని నిర్ధేశిస్తాయని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పవన్‌కుమార్‌ అన్నారు.

ప్రతి అడుగు జీవిత పథాన్ని నిర్ధేశిస్తుంది
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారి పవన్‌కుమార్‌

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతరేక దినోత్సవంలో న్యాయాధికారి పవన్‌కుమార్‌

విద్యార్థులకు న్యాయ అవగాహనా సదస్సు

తెనాలి క్రైం, జూన్‌ 26 : మనిషి ఏది పొందాలన్నా, ఏది సాఽధించాలన్నా అతని చేతుల్లోనే ఉంటుంది. అతను వేసే ప్రతి అడుగు అతని జీవిత పధాన్ని నిర్ధేశిస్తాయని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పవన్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఎన్‌ఆర్‌కే అండ్‌ కేఎస్‌ఆర్‌ గుప్తా డిగ్రీ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ 11వ అదనపు జిల్లా న్యాయాధికారి డి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా పాల్గొన్న న్యాయాధికారి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ ఎంతో విలువైనదని ఈ దశలో తప్పటడుగులు పడకూడదన్నారు. ఆకర్షణలకు లోనై చెడు మార్గం పడితే జీవితం పతనం దిశగా పయనిస్తుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. సమాజంపై అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాలు వినియోగంపై అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల లాంటి చెడు వ్యసనాలకు బానిసలైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. విద్యార్థి దశలో నుంచే విలులవతో కూడిన జీవనం సాగించాలని న్యాయాధికారి కోరారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయకృష్ణ, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్‌, యర్రంశెట్టి అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి : డీఎస్పీ రమేష్‌

తెనాలి అర్బన్‌ : మత్తు పదార్ధాలు సేవించే వారు వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ రమేష్‌ హెచ్చరించారు. పట్టణంలో జులాయిగా తిరుగుతూ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని గుర్తించి బుధవారం టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మత్తు పదార్ధాల వలన జీవితాలు నాశనమవుతాయని, కుటుంబానికి దూరం కావడమే కాకుండా కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని చెప్పారు. పట్టణంలో గంజాయి విక్రయాలు జరిగినా, దానికి బానిసలైన వారు కొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిఐ సుధాకర్‌, పోలీసులు పాల్గొన్నారు.

తెనాలి, మారీసుపేట: పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్యవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని పట్టణ ఎన్సీసీ 22(ఏ) బెటాలియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని శ్రీరావి సాంబ య్య మునిసిపల్‌ బాలురోన్నత పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్యవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని పట్టణ ఎన్సీసీ 22 (ఏ) బెటాలియన్‌ తెనాలి కమాన్డింగ్‌ ఆఫీసర్‌ లెప్టెనెంటు కర్నల్‌ జే.మహేష్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం కలిగే దుష్పలితాలు, వాటి వల్ల వ్యక్తిగత జీవితాలపై చూపించే ప్రమాదాల గురించి వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్‌ మొలాబీ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్ధిని, విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. అనంతరం పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్యవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు నామ్యానాయక్‌, ిపీ.సర్ధార్‌, కే.అశోక్‌, వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్వీఆర్‌ కళాశాల, అంబేద్కర్‌ కళాశాల పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 01:29 AM