Share News

18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

ABN , Publish Date - May 30 , 2024 | 01:11 AM

నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
కౌంటింగ్‌ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు

- ఎడ్వర్డ్‌పేట నుంచి ప్రారంభం

- పెదతురకపాలెంతో ముగింపు

- నరసరావుపేటలో 100 బూతలు

నరసరావుపేట, మే 29: నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ ఇంజనీంగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరనగనున్నది. ఒక్కొక్క రౌండ్‌లో 14 బూతల ఓట్ల లెక్కింపు చేస్తారు. మొత్తం 245 బూతలలో పోలింగ్‌ జరిగింది. మొత్తం ఓట్లు 2,32,778 ఓట్లు ఉండగా 1,88,701 ఓట్లు పోలయ్యాయి. 18రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 17 రౌండ్లలో 238 బూతలు, 18వ రౌండ్‌లో 7 బూతలలో ఓట్ల లెక్కింపు జరగుతుంది. రొంపిచర్ల మండలం ఎడ్వర్డుపేట నుంచి కౌంటింగ్‌ ప్రారంభమై నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామంతో ముగుస్తుంది. పట్టణంలో వంద బూతలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌లు 3,551, హోం ఓటింగ్‌ 176 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపునకు రెండు టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌లతో పాటు సమాంతరంగా ప్రారంభమవుతుంది. ఒక్కొక్క రౌండ్‌కు 14 బూతల ఓట్లను లెక్కిస్తారు. ఆర్‌వో పీ సరోజ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. మూడు అంచల భద్రతను పోలీసుశాఖ నిర్వహిస్తున్నది. కౌంటింగ్‌ ప్రక్రియపై వీడియో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఒక విడత పూర్తి చేశారు. మొదటి ఐదు రౌండ్లలో రొంపిచర్ల మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 5వ రౌండ్‌ నుంచి నరసరావుపేట మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది. ప్రధాన పార్టీలు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకొని వారికి శిక్షణ ఇస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 14మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థుల అందరి తరుపున కౌంటింగ్‌ ఏజెంట్లు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఇందుకు తగ్గట్టుగా కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లుచేశారు. మరో ఆరు రోజుల్లో తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.

Updated Date - May 30 , 2024 | 01:11 AM