Share News

Chandrababu Naidu: చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం.. పోలీసులు అలర్ట్

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:53 PM

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి దగ్గరలో ఉన్న తాటి చెట్లకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్ కావడంతో.. పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

Chandrababu Naidu: చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం.. పోలీసులు అలర్ట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి దగ్గరలో ఉన్న తాటి చెట్లకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్ కావడంతో.. పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే.. నిప్పులు ఎగిసిపడుతున్న సమయంలోనే పలువురు హైకోర్టు జడ్జీలు అటుగా వెళ్లారు. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మంటల్ని అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలేంటనేవి ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాలి.

Updated Date - Feb 14 , 2024 | 06:53 PM