Share News

EX MD of Beverages Corporation, Vasudeva Reddy : : ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:05 AM

లీజు గడువు ముగియకముందే మద్యం షాపును బలవంతంగా ఖాళీ చేయించి తనకు 50 లక్షలు నష్టం వచ్చేలా చేశారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై.వెంకటేవ్వరరావు శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

EX MD of Beverages Corporation, Vasudeva Reddy :  : ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

హైకోర్టుకు బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి

విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): లీజు గడువు ముగియకముందే మద్యం షాపును బలవంతంగా ఖాళీ చేయించి తనకు 50 లక్షలు నష్టం వచ్చేలా చేశారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై.వెంకటేవ్వరరావు శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. షాపు ఖాళీ చేయించడం వెనుక బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పాత్ర ఉందని ఆ కేసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.నగే్‌షరెడ్డి వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు ఆరోపణలతో వాసుదేవరెడ్డికి సంబంధం లేదన్నారు. బెవరేజెస్‌ కార్పోరేషన్‌ ఎండీగా ఉండడంవల్ల ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఐడీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌పై మొత్తం 4కేసులు నమోదయ్యాయని వివరించారు. పిటిషనర్‌కు గతంలో ఓ కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చారన్నారు. వాటిని అనుసరించి పిటిషనర్‌ పోలీసుల ముందు హాజరు కాలేదన్నారు. అరెస్ట్‌ చేస్తామనే ఆందోళన అవసరం లేదన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.

Updated Date - Aug 09 , 2024 | 04:05 AM