Share News

Chittor: చిత్తూరులో ఏనుగు హల్ చల్.. భయాందోళనలో వాహనదారులు

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:31 PM

చిత్తూరులో ఓ ఏనుగు హల్ చల్ చేస్తోంది. ఆదివారం ఉదయాన్నే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి.. వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది.

Chittor: చిత్తూరులో ఏనుగు హల్ చల్.. భయాందోళనలో వాహనదారులు

చిత్తూరు: చిత్తూరులో ఓ ఏనుగు హల్ చల్ చేస్తోంది. ఆదివారం ఉదయాన్నే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి.. వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది. దాన్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. అది పలమనేరు వద్ద బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిని దాటడానికి ప్రయత్నించింది.

వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటలేకపోవడంతో అక్కడే తిష్ట వేసింది. ఏనుగును వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దాదాపు 4 గంటలుగా అది అక్కడే ఉన్నా.. అటవీ శాఖ సిబ్బంది ఇంకా రాలేదని స్థానికులు వాపోతున్నారు. దాన్ని త్వరగా బంధించి అడవిలో వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు.

KCR: రైతుల చెంతకు బయల్దేరిన కేసీఆర్.. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే

Updated Date - Mar 31 , 2024 | 12:32 PM