Share News

Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో ఇద్దరు ఔట్!

ABN , Publish Date - May 25 , 2024 | 09:37 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravi) ఇంటికి వెళ్లి..

Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో ఇద్దరు ఔట్!

నంద్యాల, ఆంధ్రజ్యోతి మే-25: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో (AP Elections) టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravi) ఇంటికి వెళ్లి.. తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను బన్నీ కోరారు. ఈ సందర్భంగా.. భారీ జనసమీకరణతో వివాదం తలెత్తింది. దీంతో అల్లు అర్జున్‌కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా.. ఈ వివాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు ఉన్నతాధికారులు. ఎస్‌బికి చెందిన స్వామి నాయక్, నాగరాజులను వీఆర్‌కు పంపుతున్నట్లు శనివారం ఉదయం పోలీసులు ప్రకటనలో తెలిపారు. భారీ జనసమీకరణ జరుగుతుందన్న సమాచారం ఇవ్వకపోవడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. కాగా.. ఇప్పటికే ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

Updated Date - May 25 , 2024 | 09:39 AM