Share News

బాబోయ్‌ వినలేం..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:55 AM

వైసీపీ సాధికార బస్‌ యాత్ర తుస్‌మంది.. జనాలను పెద్ద ఎత్తున తరలించినా సభ ఆరంభమయ్యేసరికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.

బాబోయ్‌ వినలేం..!
ఖాళీగా వైసీపీ సాధికార సభ కుర్చీలు

150 బస్సుల్లో జనం తరలింపు

2 గంటలు ఆలస్యంగా సభ

జనం వచ్చి.. వెళ్లిపోయారు..

ఖాళీ కుర్చీలకే నాయకుల ప్రసంగాలు

సభ పూర్తికాకుండానే ముగింపు

కోరుకొండ, జనవరి 7 : వైసీపీ సాధికార బస్‌ యాత్ర తుస్‌మంది.. జనాలను పెద్ద ఎత్తున తరలించినా సభ ఆరంభమయ్యేసరికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సుమారు రెండు గంటల ఆలస్యంగా సభ ఆరంభంకావ డంతో జనం విసిగిపోయారు. సభ ఆరంభమైన కాసేపటికే జనం కుర్చీల నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు.పలు ప్రైవేటు కళాశాలలకు చెందిన 150 బస్సుల్లో జనాన్ని పెద్ద ఎత్తున తరలించినా ఉపయోగం లేకుండాపోయింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ బూరుగుపూడిగేటు వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన సామాజికసాధికార బస్సు యాత్రసభ నిర్వహించారు. సభా ప్రారంభానికిముందు అంబేద్కర్‌, జ్యోతిరావుఫూలే, బాబు జగజ్జీవన్‌రామ్‌విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సామాజిక సాధికారతను మంత్రులు జోగిరమేష్‌, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, మరో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ , జక్కంపూడి విజయలక్ష్మి,జక్కంపూడి గణేష్‌ తదితరులు వివరించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడిచిన నాలుగున్నరేళ్లలో రాజానగరం నియోజకవర్గం రూ.1158 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సీతానగరం రోడ్డును రూ.104 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు.రూ.215 కోట్లతో ఇంటింటికి గోదా వరి తాగునీరు అందిస్తామన్నారు. రూ.91 కోట్లతో ముంపు సమస్య పరిష్కరిస్తామన్నారు.దోసకాయలపల్లి నుంచి 3 కిలోమీటర్లు సామాజికసాధికార బస్సు యాత్ర సాగింది.తదుపరి బూరుగుపూడి గేటువద్ద బహిరంగ సభ నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచే జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చారు.కానీ సభ 5 గంటల తర్వాత ప్రారంభించారు. ఈలోపు సభ మధ్యలో జనం వెళ్లడం మొదలుపెట్టారు. ఒక మంత్రి కొద్ది మంది నేతలు మాట్లాడేసరికి వేదిక మీద,నేతలు, ప్రక్కన కొద్ది మంది జనం మాత్రమే మిగి లారు. మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, తదితర నేతలంతా మాట్లాడవలసి ఉంది. కానీ ఇంతలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మైక్‌ అందుకుని, ఇప్పటికే నాలుగు గంటలైనందు వల్ల సభ ముగిస్తున్నామని, ఇంకా మంత్రులు మాట్లాడవలసి ఉన్నప్పటికీ, వారు ఇక్కడి వారేకాబట్టి ఎపుడైనా వారి మాటలు వినవచ్చని చెప్పి సభను ముగించ డం గమనార్హం. ఈ బహిరంగ సభలో జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, ఏఎం సీ చైర్మన్‌ నక్కా రాంబా బు, బొరుసు బద్రి, అడ పా కనకరాజు,గణేశుల పోసియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:55 AM