Share News

ఇంకా పెత్తనమేంటో

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:11 AM

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఐప్యాక్‌ బృందాల తీరుతో జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తలపట్టుకుం టున్నారు. నియోజకవర్గాలపై బృందం సభ్యులకు పెద్దగా పట్టులేకపోయినా తమ నెత్తినెక్కి తాండవం చేస్తుండడం తట్టుకోలేకపోతున్నారు.

ఇంకా పెత్తనమేంటో

  • జిల్లాలో ఐప్యాక్‌ బృందాల పెత్తనంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కుతకుత

  • నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంత పంచాలో లెక్కలేసి ఐప్యాక్‌ నివేదికలు

  • బలహీన ఓటు బ్యాంకు ప్రాంతాలపై దృష్టిపెట్టడం లేదంటూ సతాయింపులు

  • టీడీపీలో చేరిన వారిని వెనక్కు తీసుకురావాలంటూ పదేపదే ఒత్తిళ్లు

  • నయానోభయానో బెదిరించి తిరిగి పార్టీలో చేర్చుకోవాలంటూ సలహాలు

  • అనుకున్న లెక్కలకు వ్యతిరేకంగా ఐప్యాక్‌ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆగ్రహం

  • ఈ ఐదేళ్లలో పార్టీకి చేసిన నష్టం చాలక తమపై పెత్తనంపై భగభగ

  • అధిష్ఠానం పంపిన బృందాల తీరుతో తలపట్టుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యేలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఐప్యాక్‌ బృందాల తీరుతో జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తలపట్టుకుం టున్నారు. నియోజకవర్గాలపై బృందం సభ్యులకు పెద్దగా పట్టులేకపోయినా తమ నెత్తినెక్కి తాండవం చేస్తుండడం తట్టుకోలేకపోతున్నారు. ఐదేళ్లలో ప్రభుత్వానికి చేయాల్సినంత నష్టం చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా తమపై పెత్తనం చేయడంపై దిగమింగుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంత పంచాలి? ఎవరితో పం చాలి అంటూ లెక్కలేసి మరీ సదరు అభ్యర్థులకు నివేదికలు ఇస్తుండడంతో గుర్రుమంటున్నారు. తమకు కొత్తగా రాజకీ యాలు నేర్పుతున్న ఐప్యాక్‌ తీరుపై కుతకుతలాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో నియోజకవర్గాల్లో వందలాది మంది వైసీపీ నేతలు, క్యాడర్‌ కొన్నినెలలుగా టీడీపీలో చేరిపోయా రు. ఇప్పుడు వారిని ఎలాగైనా వెనక్కు తేవాలంటూ ఐప్యాక్‌ ఒత్తిడి తెస్తుండడంతో సదరు అభ్యర్థులు ఐప్యాక్‌ తీరుతో తలలు పట్టుకుంటున్నారు. జరగని పని చేయాలంటూ నివే దికలు అధిష్ఠానానికీ పంపుతుండడంతో నెత్తీనోరు బాదుకుం టున్నారు. తమ రాజకీయ వ్యూహాలకు అడుగడుగునా అడ్డు తగులుతూ సతాయిస్తుండడంపై రగిలిపోతున్నారు.

చెప్పినట్లు చేయాల్సిందే..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ జనం లోకి వెళ్లడం కంటే ప్రలోభాలపైనే ఎక్కువగా ఆధారపడుతు న్నారు. ఓట్లకోసం ఇంటింటికీ వెళ్తుంటే నిరసనలు, నిలదీతలు ఎదురవుతుండడంతో అడ్డదార్లు ఎంచుకుంటున్నారు. వలంటీ ర్లకు డబ్బులు, గిఫ్ట్‌లు, ఇతర ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. గ్రామాల్లో పార్టీ దిగువస్థాయి క్యాడర్‌, నేతలు, గ్రామ పెద్దలకు ఎక్క డికక్కడ విందులు, వినోదాల తో రంజింప చేస్తున్నారు. త ద్వారా ప్రజావ్య తిరేకతనుంచి ఎంతోకొంత తప్పించుకోవడా నికి అడ్డదారి వ్యూహాలు అమ లు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వీరికి ఐప్యాక్‌ టీం లు చుక్కలు చూపిస్తుండడం తో ఆయా నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు తలపట్టు కుంటున్నారు. తాము చేస్తు న్న రాజకీయానికి పూర్తి వ్యతిరేకంగా వ్యూహాలు, సూచనలు, సలహాలు ఇస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు అభ్యర్థులైతే ఐప్యాక్‌ టీంలతో లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఏయే మండలంలో ఏగ్రామాల్లో పార్టీ అత్యంత బలహీనంగా ఉందో గుర్తించి అక్కడ ఎన్నికల సమ యంలో ఎంత పంచాలి? ఎవరికి పంచాలి? ఎవరితో పంచే లా చూడాలి? అంటూ ఇటీవల కొన్ని నివేదికలను ఆయా అ భ్యర్థులకు అందించింది. ఆయా గ్రామాల్లో బలమైన నాయకు లు, క్యాడర్‌ ఇటీవల టీడీపీలో భారీఎత్తున చేరిపోయినట్లు ఐప్యాక్‌ బృందాలు గుర్తించాయి. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠా పురం, తుని, కాకినాడ రూరల్‌, పెద్దాపురం నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో వారం దరినీ ఏదోలా వెనక్కు తీసుకురావాల్సిందేనని అభ్యర్థులపై ఒత్తిడి తెస్తోంది. నయానోభయానో ఒప్పించి తీరాలంటూ హుకుం జారీచేస్తోంది. దీంతో ఆయా అభ్యర్థులు రగిలిపోతు న్నారు. జరగని పని ఎలా చేయడం అంటూ ఐప్యాక్‌ తీరుపై మండిపడుతున్నారు. ఇలా బతిమాలుకుంటే ఓడిపోయినట్లు ముందే అంగీకరించినట్లవుతుందని, అదీ కాకుండా పార్టీలో ఉన్న క్యాడర్‌ ముందు పరువుపోతుందని సదరు అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. కానీ ఐప్యాక్‌ మాత్రం పార్టీ అధిష్ఠా నానికి నివేదికలు పంపుతోంది. తిరిగి ఇవి సదరు అభ్యర్థుల వద్దకు వస్తుండడంతో వీరంతా రగిలిపోతున్నారు. ఐప్యాక్‌కు అసలు నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహాలు తెలియకుండా తమపై బలవంతంగా రుద్దుతున్న తీరుపై చిటపటలాడుతు న్నారు. తమ రాజకీయ వ్యూహాలను పక్కనపెట్టి ఐప్యాక్‌ చెప్పిందల్లా చేస్తే చేటు తప్పదేమోనని కలవరపడుతున్నా యి. ఇప్పటికే జగన్‌ పాలనపైనా, ఎమ్మెల్యేల పనితీరుపైనా తప్పుడు నివేదికలను ఐప్యాక్‌ ఇవ్వడంవల్లే ఈ రోజు ఇంత వ్యతిరేకత ఉందని, ఇప్పుడింకా తప్పుడు సలహాలతో తమ కొంప ముంచేస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థులు నెత్తీనోరుబాదు కుంటున్నారు. తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకి నాడ రూరల్‌, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈ తరహా సల హాలు ఎక్కువవడంతో ఐప్యాక్‌ తీరుపై సదరు నేతలు మండి పడుతున్నారు. వీరిలో కొందరైతే ఐప్యాక్‌ చెప్పినట్లు చేస్తే రాజకీయం చేయలేమని వారిని నివేదికలు పక్కన పడేస్తు న్నారు. పార్టీలో నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కం టే వీరిని మెప్పించడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుండడంపై కొందరు మింగలేక కక్కలేకపోతున్నారు. అధిష్ఠానంవల్లే తమ పై పెత్తనం చేస్తున్నారంటూ కారాలు, మిరియాలు నూరుతు న్నారు. దీన్ని పార్టీ పెద్దలకు చెప్పలేక, ఐప్యాక్‌తో గొడవపడ లేక ఇంకెంతనష్టపోవాల్సి వస్తుందోనని మథనపడుతున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:11 AM