మంత్రులూ..మటాష్!
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:48 AM
కూటమి సునామీలో అందరూ కొట్టుకుపోయారు... మంత్రులూ లేదు.. ఎమ్మెల్యేలు లేదు.. ఏడుకు ఏడు నియోజకవర్గాల్లోనూ ఓటరు ఎవరినీ చూడలేదు.. జిల్లా వ్యాప్తంగా ఒకటే తీర్పునిచ్చారు..వైసీపీ జిల్లా మంత్రులు మరీ ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో చావుదెబ్బ తి న్నారు.

పనిచేయని జగన్ మంత్రం
స్థానాలు మార్చినా ఫలితం శూన్యం
మద్దిపాటి చేతిలో మంత్రి వనిత ఓటమి
గోరంట్ల చేతిలో మంత్రి వేణుకు పరాజయం
వనిత స్వగ్రామంలోనూ కూటమిదే పైచేయి
గోరంట్లకు 64,090 ఓట్ల మెజార్జీ
మద్దిపాటికి 26,784 మెజార్టీ
ఎక్కడా ప్రభావం చూపని మంత్రులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
కూటమి సునామీలో అందరూ కొట్టుకుపోయారు... మంత్రులూ లేదు.. ఎమ్మెల్యేలు లేదు.. ఏడుకు ఏడు నియోజకవర్గాల్లోనూ ఓటరు ఎవరినీ చూడలేదు.. జిల్లా వ్యాప్తంగా ఒకటే తీర్పునిచ్చారు..వైసీపీ జిల్లా మంత్రులు మరీ ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో చావుదెబ్బ తి న్నారు. జిల్లాలో ఏకంగా ఐదేళ్ల పాటు మంత్రిగా బాధ్య తలు నిర్వర్తించిన తానేటి వనిత తొలిసారిగా బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు చేతిలో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఆమె గత ఎన్ని కల్లో కొవ్వూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిమంత్రివర్గంలోనే మహిళా శిశు సంక్షేమశాఖ, రెండో దఫా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో చాలా మంది మంత్రులు కేవలం మొదట రెండున్నరేళ్లు మంత్రి పదవిలో ఉండగా వనిత ఏకంగా ఐదేళ్లూ మంత్రిగా వ్యవహరించారు. అయితే కొవ్వూరులో తీవ్ర వర్గవిభేదాల కారణంగా ఆమె గెలుపు కష్టమనే కోణంలో కొవ్వూరు నుంచి మార్చి గోపాలపురం నుంచి పోటీ చేయించారు. కానీ ఆమె గతంలో గోపాల పురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వార వైసీపీలో చేరారు. ఆమె సొంతూరు గోపాలపురం నియో జకవర్గంలోని దేవరపల్లి మండలం యర్నగూడెం. ఆమె తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ గ్రామంలో మొత్తం 5177 ఓట్లుగా పోలవ్వగా వనితకు 2193 ఓట్లు మాత్రమే లభించాయి. టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంక ట్రాజుకు 2774 ఓట్లు లభించాయి. వనిత కంటే 581 ఓట్లు అధికంగా వచ్చాయి.ఆమె సొంతూరులోనే ఆమెకు మెజార్టీ రాలేదు. అక్కడి ప్రజలను టీడీపీ అభ్యర్థి ఆక ట్టుకోగలిగారు. టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం పరి ధిలోని ప్రకాశరావుపాలెం. అక్కడ నాలుగు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి.అక్కడ పోలైన ఓట్లలో వెంకట్రాజుకు 2101 ఓట్లు రాగా వనితకు కేవలం 1581 ఓట్లు వచ్చా యి. వెంకట్రాజుకు స్వగ్రామంలో 520 ఓట్లు మెజార్టీ లభించడం గమనార్హం. ఓ సామా న్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రాజు అంచలంచె లుగా ఎదిగి మంత్రి తానేటి వనితను ఓడించి ఎమ్మెల్యే అయ్యా రు.ఆయనకు 26,784 ఓట్ల మెజార్టీ వచ్చిం ది. ఇక్కడ మొత్తం 2,11,659 ఓట్లు పోల వ్వగా మద్దిపాటికి 1,14,420 ఓట్లు, వైసీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తానేటి వనితకు కేవలం 87,636 ఓట్లు లభిం చాయి.జిల్లాలో మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపా లకృష్ణ.జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేతిలో ఘోర పరాజయం పాల య్యారు. గోరంట్ల ఇప్పటికి జిల్లాలో 11 సార్లు పోటీ చేశారు. రాజమండ్రి సిటీలో నాలుగు సార్లు గెలిచారు. పొత్తుల కారణంగా రాజమహేంద్రవరం రూరల్‌లో 2014 నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తున్నారు. రూర ల్‌లో హ్యాట్రిక్ సాధించారు.సిటీ,రూరల్‌లో మొత్తం ఏడుసార్లు గెలిచారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ కుట్ర చేసి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ఉన్న వేణును రూరల్‌కు బదిలీ చేశారు. వేణు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కూడా ఉండేవారు. ఆయన టీడీపీ సంప్రదాయ ఓట్లయిన బీసీ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు.అది నెరవేర లేదు.ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏకంగా 64,090 ఓట్లు మెజార్టీ సాధించారు. రూరల్‌లో మొత్తం 2,02,058 ఓట్లు పోలవ్వగా, గోరంట్ల బుచ్చయ్యచౌదరికి 1,29,068 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి చెల్లు బోయిన వేణుకు కేవలం 64,090 ఓట్లు లభించాయి. ఇలా ఇద్దరు మం త్రులు ఓటమి పాలయ్యారు.