Share News

వైసీపీ ప్రభుత్వంలో కాపులకు తీరని అన్యాయం: రాజప్ప

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:27 AM

రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వంలో కాపులకు తీరని అన్యాయం జరిగిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వంలో కాపులకు తీరని అన్యాయం: రాజప్ప

మండపేట, ఏప్రిల్‌18: రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వంలో కాపులకు తీరని అన్యాయం జరిగిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. స్థానిక సూర్య కన్వె న్షన్‌ హాల్‌లో టీడీపీ ఆధ్వర్యంలో కాపులు ఆత్మీయ సమ్మే ళనం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు అధ్య క్ష తన జరిగింది. సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును కులాలకు అతీ తంగా గెలి పించాలని రాజప్ప కోరారు. జనసేన అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ యువత కూటమికి ఓట్లు వేసి పవన్‌ ఆశయాలను నెరవేర్చాలన్నారు.ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఐదేళ్లు కూటమి సభ్యులకు అందుబాటులో ఉంటానన్నారు. జనసేన ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ కొత్త నాయకుడు వచ్చి ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేప్రయత్నం చేస్తు న్నాడని ఎమ్మెల్సీ తోటను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆకుల రామకృష్ణ మాట్లాడూతూ వైసీపీ ప్రభుత్వంలో కాపులు అన్నివిధాలుగా అణగదొక్కపడ్డారన్నారు. వేగుళ్ల గెలుపు కోసం పనిచేస్తామని సమావేశానికి హాజరైన కాపునేతలంతా పేర్కొ న్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణలను కాపు నేతలు గజమాలతో సత్కరించారు. ఆత్మీయ సమావే శంలో కాపు నేతలు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్‌, టీడీపీ నేతలు మెట్ల రమణబాబు, అల్లాడ స్వామినాయుడు, వాదా ప్రసాదరావు, ఉండమట్ల రామారావు, కర్రి తాతారావు, పిల్లా తాతాలు, జొన్నపల్లి సూర్యారావు, చింతల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 07:15 AM