Share News

దళితులపై ఇంత పగా?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:33 AM

వైసీపీ నాయకుల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన.. దళితులను ఏం చేసినా మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనే అహానికి నిదర్శనం ఈ ఘటన.. ఇంతకీ ఏమిటా ఘటన అంటే.. దళిత లోకమే నివ్వెరపోయిన విషాద ఘటన.. వైసీపీ పాలనలో అనంత అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యం..

దళితులపై ఇంత పగా?

  • వైసీపీ ఐదేళ్ల పాలనలో అనంత దారుణాలు

  • ఉమ్మడి తూ.గో.జిల్లాలో దళితులపై దమనకాండ

  • చేతికి అధికారం కట్టబెడితే దళితులకు ఫ్యాన్‌ షాక్‌లు

  • హత్యలు.. దౌర్జన్యాలు, దాడులు, శిరోముండనాలు

వైసీపీ నాయకుల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన.. దళితులను ఏం చేసినా మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనే అహానికి నిదర్శనం ఈ ఘటన.. ఇంతకీ ఏమిటా ఘటన అంటే.. దళిత లోకమే నివ్వెరపోయిన విషాద ఘటన.. వైసీపీ పాలనలో అనంత అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద పనిచేసిన దళిత యువకుడైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను 2022 మే 18న నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు.. మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనే ధైర్యం కావొచ్చు.. తన కారులోనే మృతదేహాన్ని తెచ్చి ఇంటి బయట విసిరేశాడు.. నిలదీసిన కుటుంబీకులతో బేరసారాలు నడిపాడు. ఒక దళిత యువకుడి ప్రాణం ఖరీదు ఇంతేనా..!? దళితులంటే ఎందుకింత పగ.. అలాంటి అనంతబాబును వైసీపీ వెనకేసుకొచ్చింది. హత్య కేసు నమోదవ కుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. తీరా బాధితులు, పౌర సంఘాలు రోడ్డెక్కడంతో అనంతబాబు అరెస్టు అయ్యారు. విమర్శలకు జడిచి అనంతబాబును వైసీపీ నుంచి సీఎం జగన్‌ సస్పెండ్‌ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ అనంతబాబును సీఎం జగన్‌ పక్కన పెట్టుకుని మరీ పర్యటనలు చేస్తున్నారు. సామర్లకోట మునిసిపల్‌ ఎన్నికల్లో తమపై పోటీకి దిగాడనే అక్కసుతో గిరీష్‌బాబు అనే దళిత యువకుడిని వైసీపీ నేతలు బెదిరించారు. తప్పుడు కేసులతో వేధించారు. దీంతో 2022 జనవరి 6న స్టేషన్‌లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుని నియోజకవర్గం తొండంగి జాతరలో రెండు సామాజిక వర్గాల ఘర్షణలో దళిత యువకుడు నడిపల్లి రాము మృతిచెందాడు. 2020లో సీతానగరంలో వరప్రసాద్‌ అనే దళిత యువకుడికి పోలీస్‌ స్టేషన్‌లోనే కొందరు వైసీపీ నేతలు శిరోముండనం చేయించారు. 2019లో కోడికత్తి కేసులో దళిత యువకుడు శ్రీను జైలు పాలయ్యాడు. ఐదేళ్ల పాటు జైలులోనే మగ్గిపోయాడు.. ఇటీవల విడుదలయ్యాడు. 2023లో కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో హోం మంత్రి తానేటి వనిత ఇలాకాలో అధికార పార్టీ ఫ్లెక్సీని చించిశాడనే కారణంతో దళిత యువకుడు మహేంద్రను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడియంలో వైసీపీ నేతల ఇసుక అక్రమాలను ప్రశ్నించిన దళిత నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు మోపి వైసీపీ నేతలు వేధిం చారు. ఇలా ఒకటేంటి... వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాలో దళితులపై ఎప్పుడేం ఘోరం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. మరో పక్క ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ దళితుల భూములపైనా, వారిపైనా పలువురు వైసీపీ నేతలు చేయని దౌర్జన్యం లేదు. పాల్పడని బెదిరింపులు లేవు. వీరంతా న్యాయం కోసం ఐదేళ్లలో ఎన్నోసార్లు ఆయా జిల్లా కలెక్టరేట్లకు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నా ఏనాడు వీరికి న్యాయం జరగలేదు. అధికారంలోకి రాక ముందు దళితులపై వైసీపీ కురిపించిన ప్రేమకాస్తా అధికారం వచ్చాక పగగా మారి వారిని వెన్నాడింది.

- (కాకినాడ, ఆంధ్రజ్యోతి)

చంపేసి..డోర్‌ డెలివరీ

కాకినాడ జిల్లా 2022లో అట్టుడికి పోయింది. తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్‌ను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మే 18న అర్ధరాత్రి కాకినాడ బీచ్‌ రోడ్డులో హత్య చేసి మృతదేహాన్ని తన కారులో అనంతబాబు డ్రైవర్‌ ఇంటికే తీసుకెళ్లాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తీరా కుటుంబీకులు తిరగబడడంతో డబ్బులు ఇస్తా నోరు తెరవొద్దని బెదిరించాడు. ఆగ్రహంతో బాధితులు నిలదీయడంతో కారు వదిలేసి పారిపోయాడు. మూడు రోజుల తర్వాత హత్య తానే చేశానని పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ముందు అనుమా నాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు బాధితులు, దళిత సంఘాల ఆందోళనతో హత్య కేసుగా మార్చారు. ఆ తర్వాత అనంత బాబును అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు జగన్‌ ప్రకటిం చారు. అయితే ఆ తర్వాత అనంతబాబును పక్కన పెట్టుకుని వైసీపీ మంత్రులు, సీఎం బహిరంగ సభలకు హాజరవడంతో అంతా నోరెళ్లబెడుతు న్నారు.ఇటీవల ప్రత్తిపాడు నియోజక వర్గం ధర్మవరం దళితవాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి అనంతబాబు పూలమాల వేశాడు. దళితుడిని చంపి అంబేడ్కర్‌ని అవమానించిన వ్యక్తికి దళితవాడల్లో తిరిగే హక్కులేదని నినాదాలు చేస్తూ దళితులు అతడిని తరిమేశారు.

తూర్పున రేగిన అశాంతి...

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రశాంతతకు మారుపేరు తూర్పుగోదా వరి.. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల కిందటి వరకూ ఉన్న పేరు.. అటువంటి ప్రశాంత తీరంలో వైసీపీ వచ్చాక అశాంతి రాజ్యమేలి ంది.సీతానగరం మండలం పెదకొండే పూడి లో ఈ ఏడాది ఫిబ్రవరి 2న తనను ఏలుకో మన్న భార్యకు భర్త శిరోముండనం చేశాడు.ఈ ఘటన వెనుక వైసీపీ నాయకులు ఉన్నారంటూ బాధితు రాలు ఆవేదన వ్యక్తం చేసింది.ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్నాడనే కార ణంతో 2020 జూలై 20న సీతానగరం మండలం మునికూడలిలో ఇండు గుమిల్లి వరప్రసాద్‌ను సీతా నగరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు గుండు గీసేశారు.ఈ కేసులో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిందితులకు అండగా ఉన్నట్టు అప్ప ట్లో దళితులు ఉద్యమించారు. బాధితుడు ప్రసాద్‌ రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశాడు.ఈ కేసులో స్థానిక వైసీపీ నాయకుడితో పాటు ఆరుగురు నిందితులుగా ఉన్నారు. దొమ్మేరులోని వైసీపీ వర్గపోరుకు బొంతా మహేంద్ర అనే యువకుడు బలైపో యాడు. హోం మంత్రి వనితకు సంబంధించిన ఫెక్సీలో తలల భాగాలు కత్తిరించి ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానితుడిగా మహేంద్రను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.తన పరువు పోయిందని తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు రైతులు కొమ్మరాజు ముత్యాలు, కొమ్మరాజు సత్యనారాయణ వద్ద తాళ్లపూ డి మండలం మలకపల్లికి చెందిన గెడ్డం శ్రీను పనిచేస్తుండేవాడు. మూడు రోజులు పనివెళ్లకపోవడంతో కౌలు రైతులు వచ్చి అతడిని ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారు.అదే రోజు సాయంత్రం శ్రీను ఆ రైతుల పొలం వద్ద ఒం టిపై నూలుపోగు కూడా లేకుండా నిర్జీవంగా పడి ఉన్నాడు.ఈ కేసులో పోలీ సుల తీరుపై ఎస్సీఎస్టీ కమిషన్‌ కూడా మండిపడింది.

పచ్చని కోనసీమలో కులచిచ్చు..

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమలో కులచిచ్చు పెట్టారు. రెండేళ్ల కిందట కొత్తగా ఆవిర్భవించిన జిల్లాకు నేరుగా అంబేడ్కర్‌ పేరు ప్రకటించకుండా అటు దళితులు, ఇటు ఇతర సామాజికవాదులు పరస్పరం ఆందోళనలు చేపట్టే వరకూ ప్రభుత్వం వేచిచూసింది. అనంతరం ప్రభుత్వం అంబేడ్కర్‌ పేరును ప్రకటించడంతో సున్నితమైన ఈ అంశం కుల ఘర్షణలకు దారితీసింది. దాంతో 2022 మే 22న పేరు మార్పును నిరసిస్తూ అమలాపురం కేంద్రంగా హింసాత్మక ఘటనలు జరిగా యి.పోలీసులపై దాడులతో పాటు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ల నివా సాలకు నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. ఆనాటి ఘటనలపై అమలాపురం పోలీసులు సుమారు 250 మందికిపైగా విధ్వంసకా రులను గుర్తించారు.ఈ ఘటనల తరువాత జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని భావించిన సీఎం జగన్‌ అమలాపురం అల్లర్ల ఘటన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. చివరకు వైసీపీకి చెందిన దళిత నేతలే హైకోర్టును ఆశ్రయించి కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను స్టే విధించారు. అయితే దళిత మంత్రి విశ్వరూప్‌ ఇల్లు తగులబెట్టిన వారిపై కేసులు ఉపసంహరించిన జగన్‌ ప్రభుత్వ తీరుపై దళిత సంఘాలు ఇప్పటికీ గుర్రుగానే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో దళితుల నుంచి ఈ ప్రభావం వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

18 మంది దళిత యువకులపై రాజద్రోహం కేసు

రావులపాలెం : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం గోపాలపురం.. 2022, జూలై 5న గోపాలపు రంలోని అన్నపూర్ణ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో టిఫిన్‌ ప్లేట్లపై అంబేడ్కర్‌ బొమ్మ ముద్రించి ఉండడాన్ని దళిత యువకులు గుర్తించి యజమానిని ప్రశ్నించడంతో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తేవ డంతో 18 మందిపై రాజద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపారు.కొద్ది రోజుల తర్వాత గోపాలపురంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో పాల్గొ నేందుకు వెళ్లిన జగ్గిరెడ్డికి వ్యతిరేకంగా దళిత మహిళలు నినాదాలు చేశారు. మా పిల్లలను జైలుకు పంపి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని నిలదీశారు.

జాతర చూసేందుకు వస్తే చంపేశారు..

తొండంగి, ఏప్రిల్‌ 17: కాకినాడ జిల్లా తొండంగి గ్రామానికి చెందిన రాజు శృంగవృక్షంలో జాతర చూసేందుకు గతేడాది మార్చి 22న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి జాతరలో స్థానిక యువకులతో అతడికి జరిగిన స్వల్ప ఘర్షణ జరిగింది.స్థానిక యువకులు పెద ఎత్తున వచ్చి రామును కొట్టడంతో అతడు మృతిచెందాడు. దీంతో పాటు పలువురు దళిత యువకులకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన వారే యువకుడి మృతికి కారణమయ్యారని వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ దళిత నాయకులు చెపుతున్న పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని పోలీసులను ఆదేశించడంతో మరో ఇద్దరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

తోటకు శిక్ష.. వైసీపీకి షాక్‌

తోట త్రిమూర్తులు పరిచయం అక్కర్లేని పేరు ఇది.. ఎందుకంటే ఆది నుంచి వివాదాలే.. అటువంటి నాయకుడు ప్రస్తుతం వైసీపీ మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు.. 27 ఏళ్ల కిందట ఆయన చేసిన నిర్వాకం తెలిస్తే దళితులు ఆగ్రహంతో ఊగిపోతారు. 1996లో రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండింపెడెంట్‌గా పోటీ చేసిన సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఒకే ఒక్క కారణంతో వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను హింసించి.. ఇద్దరికి శిరోముండనం చేయించారు. ఈ కేసులో విశాఖ కోర్టు మంగళవారం తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఎన్నికల వేళ వైసీపీకి షాక్‌ తగిలింది.

జగన్‌ రాజకీయ జీవితానికి.. దళితులే సమాధి కడతారు

జగన్‌ రాజకీయ జీవితానికి దళితులే సమాధి కడతారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్‌ సుధాకర్‌ దగ్గర నుంచీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం వరకూ దళితులపై తీవ్రంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళితులను వంచిం చడంలో వైసీపీ శక్తివంచన లేకుండా పని చేసింది. జగన్‌కి దళితులు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. - ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Apr 18 , 2024 | 12:33 AM