Share News

పీకేశారు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:18 AM

అనుకున్నట్టే పక్కన పెట్టేశారు. సర్వేల సాకుతో, మళ్లీ నెగ్గరనే మిషతో వైసీపీ అధిష్ఠానం జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలపై వేటేసింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ లేదని చెప్పేసింది. ఈమేరకు వారి స్థానంలో కొత్త ఇంఛార్జులను అధికారికంగా ప్రకటించింది. తద్వారా ఇంతకాలం తమ టిక్కెట్‌కు ఢోకా లేదని ధీమాగా ఉన్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌ ఇచ్చారు. వారి రాజకీయ భవిష్యత్తును సమాప్తం చేసేశారు. అంతేకాదు ఇంతకాలం నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పెత్తనం చేసిన చోటే మరోకరి కింద పనిచేయాలని పార్టీ హుకుం జారీ చేసినట్టయింది. దీంతో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కుతకుతలాడుతున్నారు. కాగా పీకేసిన ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్తిపాడు టిక్కెట్‌ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు, జగ్గంపేట టిక్కెట్‌ మాజీ మంత్రి తోటనరసింహంకు, పిఠాపురం సీటు ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతకు ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్ఠానం సీటు చింపేసిన నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు పవన్‌ను కలవడంతో జనసేనలో చేరిక ఖాయమనే సంకేతాలు పంపారు. పిఠాపురం ఎమ్మెల్యే సైతం అడుగులు అటువైపే అన్నట్టు సాగుతున్నాయి. పర్వత మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

పీకేశారు!

జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు షాక్‌

వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా పీకిపారేసిన వైసీపీ అధిష్ఠానం

పనితీరు బాగోకపోవడం, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే సాకుతో టిక్కెట్‌ నిరాకరణ

శూన్యంగా పర్వత ప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబుల రాజకీయ భవిష్యత్‌

వీరి స్థానంలో ప్రత్తిపాడు సీటు వరుపుల సుబ్బారావు,

జగ్గంపేట నరసింహం, పిఠాపురం సీటు గీతకు

పనితీరు బాగోలేదంటూ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో కుతకుతలాడుతున్న సిట్టింగ్‌లు

ఇప్పటికే పవన్‌ను కలిసిన జ్యోతుల చంటిబాబు.. రేపోమాపో జనసేన తీర్థం

అటు పెండెం దొరబాబు సైతం పార్టీ మారుతారని ప్రచారం..

గమ్యం తోచని రీతిలో పర్వతప్రసాద్‌

జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లను మార్చుతున్నట్టు ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

అనుకున్నట్టే పక్కన పెట్టేశారు. సర్వేల సాకుతో, మళ్లీ నెగ్గరనే మిషతో వైసీపీ అధిష్ఠానం జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలపై వేటేసింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ లేదని చెప్పేసింది. ఈమేరకు వారి స్థానంలో కొత్త ఇంఛార్జులను అధికారికంగా ప్రకటించింది. తద్వారా ఇంతకాలం తమ టిక్కెట్‌కు ఢోకా లేదని ధీమాగా ఉన్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌ ఇచ్చారు. వారి రాజకీయ భవిష్యత్తును సమాప్తం చేసేశారు. అంతేకాదు ఇంతకాలం నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పెత్తనం చేసిన చోటే మరోకరి కింద పనిచేయాలని పార్టీ హుకుం జారీ చేసినట్టయింది. దీంతో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కుతకుతలాడుతున్నారు. కాగా పీకేసిన ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్తిపాడు టిక్కెట్‌ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు, జగ్గంపేట టిక్కెట్‌ మాజీ మంత్రి తోటనరసింహంకు, పిఠాపురం సీటు ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతకు ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్ఠానం సీటు చింపేసిన నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు పవన్‌ను కలవడంతో జనసేనలో చేరిక ఖాయమనే సంకేతాలు పంపారు. పిఠాపురం ఎమ్మెల్యే సైతం అడుగులు అటువైపే అన్నట్టు సాగుతున్నాయి. పర్వత మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్‌ తగిలింది. ఇంతకాలం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ వెలుగు వెలిగి, నియోజకవర్గాల్లో తమకు ఎదురేలేదన్నట్టు వ్యవ హరించిన వీరి ముగ్గురికి వైసీపీ అధినేత జగన్‌ టిక్కెట్‌ చింపేశారు. రాబోయే ఎన్నికల్లో వీరికి సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. వీరి స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళ వారం రాత్రి ఓ ప్రకటన జారీచేసింది. దీంతో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్ఠానంపై కుతకుతలాడుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ చెప్పిన పనులు చేస్తూ, ఊడిగం చేస్తే ఇప్పుడు సర్వే పేరుతో టిక్కెట్లు నిరాకరించడంపై భగ్గుమంటున్నారు. ఇదేనా న్యాయం అం టూ నిప్పులు కక్కుతున్నారు. నియోజకవర్గాల్లో గడపగడప, జగనన్న సురక్ష తదితర కార్యక్రమాల్లో తరచూ పాల్గొన్నా సరే పనితీరు బాగో లేదని, సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయనే నెపంతో టిక్కెట్‌ నిరా కరించడంపై ఈ ముగ్గురు భగ్గుమంటున్నారు. ప్రజా వ్యతిరేకత జగన్‌పైనా, వైసీపీపైనా ఉంటే తమను అకారణంగా బలిచేయడంపై ధ్వజమెత్తుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మంగళవారం తమకు టిక్కెట్‌ నో చెప్పడంతో ఈముగ్గురు అజ్ఞాతంలోకి జారుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులకు సైతం దొరకకపోవడం చర్చనీయాం శంగా మారింది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్‌ ఢోకా లేదని ఇంతకాలం ఈ ముగ్గురు ధీమాగా ఉన్నారు. అధిష్ఠానం ఆశీ స్సులు, జిల్లా పార్టీ పరిశీలకుడు మిథున్‌రెడ్డితో పరిచయాలు తమ సీటుకు ఢోకాలేకుండా చేస్తుందని భావించారు. తీరా టిక్కెట్‌ చింపే యడంతో రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారడంతో నిస్సహా యంగా మారారు. అయితే ఈ ముగ్గురికి టిక్కెట్‌ ఇవ్వడం లేదంటూ పదిరోజుల కిందట సీఎం జగన్‌ పిలిచి చెప్పేశారు. కొత్త ఇంఛార్జు లతో పనిచేయాలని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ తన నాటి కథనంలో పేర్కొంది. ఈనేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు చంపే సుకోకూడదన్న నిర్ణయంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటి బాబు ఇటీవల కాకినాడలో పవన్‌ను కలిశారు. జగ్గం పేట టిక్కెట్‌ జనసేన నుంచి కోరారు. కానీ దీనిపై స్ప ష్టత రాలేదు. అయితే త్వరలో చంటిబాబు జనసేనలో చేరడం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అటు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. ఈయన కూడా త్వరలో ఓ పార్టీలో చేరుతారని తెలిసింది. తాజా సీట్ల మార్పుతో జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ దా దాపు ఖాళీ కానుంది. వైసీపీ తీరుతో భారీగా కేడర్‌ సైతం రాజీనామాలు చేసే అవకాశం ఉందని తెలు స్తోంది. దీంతో కొత్త ఇంఛార్జులకు ఆదిలోనే పార్టీలో తలనొప్పులు మొదలుకాక తప్పదని చెబుతున్నారు.

కొత్త వాళ్లైనా కష్టమే...

ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు పీకేసిన వైసీపీ అధిష్ఠానం కొత్త ఇంఛార్జులను ప్రకటించింది. వీరిలో పిఠాపురం ఎమ్మెల్యే టిక్కెట్‌ కాకినాడ ఎంపీ వంగా గీతకు కేటాయించింది. ప్రస్తుతం ఆమె ఎంపీ సీటు నుంచి పోటీచేస్తే ఓడిపోతారని తేలడం, అటు పిఠాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు గడ్డు పరి స్థితి ఎదుర్కోవడంతో ఈ మార్పులు చేసింది. అయితే ఎంపీ గీతకు ఇక్కడ టిక్కెట్‌ ఇచ్చినా వైసీపీ శ్రేణులు ఈమెకు సహకరించడానికి సిద్ధంగా లేవని చెబుతు న్నాయి. అటు తమకు టిక్కెట్‌ నిరాకరించారనే ఆగ్ర హంతో దొరబాబు వర్గీయులు సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు. జగ్గంపేట సీటు చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంకు కేటాయించారు. గతంలో ఈయన 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి చి మంత్రిగాను పనిచేశారు. అయితే ఇక్కడ చంటి బాబు ఈసారి గెలవరనే కారణంతో తోటకు వైసీపీ టిక్కెట్‌ కేటాయించింది. అయితే ఈయన కూడా గడచిన ఏడాదిన్నర నుంచి జగ్గంపేట టిక్కెట్‌ తన దేనంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబు, తోటకు మధ్య ఈ విషయంలో పరోక్షంగా గొడవలు కూడా జరిగాయి. వారి వారి అనుచరుల మధ్య తీవ్ర గందరగోళం నెల కొంటూ వచ్చింది. ఇప్పుడు అనుకున్నట్టే టిక్కెట్‌ తోటకు రావడంతో చంటిబాబు వర్గీయులు కుతకుతలాడిపో తున్నారు. ఈనేపథ్యంలో వేరే పార్టీ నుంచి అయినా టిక్కెట్‌ తెచ్చుకుని తోటను ఓడించాలనే పట్టుదలతో చంటిబాబు వర్గీయులున్నారు. మరోపక్క ప్రత్తిపాడు సీటు నుంచి పర్వత ప్రసాద్‌ను తప్పించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కేటాయించారు. ఈయన 2004,2014లో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి వైసీపీలో టిక్కెట్‌ కేటాయించారు. అయితే పర్వతకు, వరుపులకు మధ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఎమ్మెల్యేగా తను ఉండగా, వరుపులను పార్టీలో చురుగ్గా ఉండా లని వైసీపీ ఏడాదిన్నర కిందట ఆదేశించింది. కానీ దీన్ని దిగమింగుకోలేక పర్వత ప్రసాద్‌ వరుపుల సుబ్బారావును నానా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు టిక్కెట్‌ పర్వతను తప్పించి వరుపులకు ఇవ్వ డంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసవత్త రంగా మారనుంది. ఈ రెండు వర్గాల జగడంలో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారనుందని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:18 AM