Share News

పార్టీకి నష్టం చేస్తే క్షమించేదిలేదు:యనమల

ABN , Publish Date - May 20 , 2024 | 12:49 AM

టీడీపీలో ఉంటూ పార్టీకే నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా పార్టీ ఉపేక్షించదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్తిపాడు మండలం టీడీపీ నాయకులు ఆదివారం తేటగుంట తరలివెళ్లి మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును కలిశారు.

పార్టీకి నష్టం చేస్తే క్షమించేదిలేదు:యనమల

ప్రత్తిపాడు, మే19: టీడీపీలో ఉంటూ పార్టీకే నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా పార్టీ ఉపేక్షించదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్తిపాడు మండలం టీడీపీ నాయకులు ఆదివారం తేటగుంట తరలివెళ్లి మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును కలిశారు. టీడీపీలో ఉంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన మురళీరాజును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, పార్టీ సభ్యత్వం రద్దు చేయుంచాలని టీడీపీ నాయకులు కోరారు. దీనికి మాజీ మంత్రి యనమల స్పందిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా పార్టీ చర్యలు తీసుకోవడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, మండల పార్టీ నాయకులు అమరాది వెంకట్రావు, పల్లా గోపి, బొల్లు కొండబాబు, దాట్ల అప్పన్నబాబు, గొంతిన సురేష్‌, జింకల తాతారావు, మంతెన శ్రీను, లొండా లోవరాజు, రోమాల అప్పలరాజు, సింగిలి వెంకటేష్‌, తటవర్తి సుబ్బారావు, ఇళ్ళ అప్పారావు, పోలిశెట్టి శ్రీను, రావూరి తాతాజీ, చిలకమర్తి వీరభద్రం, పుణ్యమంతుల శ్రీను పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:49 AM