Share News

వక్రమార్గాల్లో కార్పొరేషన్‌ సొమ్ము దోచుకుంటున్న ద్వారంపూడి

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:36 AM

కాకినాడ నగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కార్పొరే షన్‌ సొమ్మును వక్రమార్గాల్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోచు కుంటున్నాడని, ముఖ్యంగా టీడీఆర్‌ బాండ్ల పేరుతో రూ.251 కోట్ల మరో కుంభకోణానికి తెరలేపి దోపిడీ శేఖర్‌ దోచుకున్నాడని కాకి నాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండ బాబు ఆరోపించారు.

వక్రమార్గాల్లో కార్పొరేషన్‌ సొమ్ము దోచుకుంటున్న ద్వారంపూడి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడలో టీడీఆర్‌ బాండ్ల పేరుతో రూ.251 కోట్ల మరో కుంభకోణం

నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు

కాకినాడ సిటీ, జనవరి 27: కాకినాడ నగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కార్పొరే షన్‌ సొమ్మును వక్రమార్గాల్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోచు కుంటున్నాడని, ముఖ్యంగా టీడీఆర్‌ బాండ్ల పేరుతో రూ.251 కోట్ల మరో కుంభకోణానికి తెరలేపి దోపిడీ శేఖర్‌ దోచుకున్నాడని కాకి నాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండ బాబు ఆరోపించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతంలో సర్వే నంబర్‌ 1986 /3డి2, టీ ఎస్‌ నంబర్‌ 1989/1ఏ,4ఏలో గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు భూమికి కాకినాడ నగరపాలక సంస్థ నుంచి గజం స్థలం రూ.28 వేల మార్కెట్‌ విలువ చొప్పున 1:4 నిష్పత్తిలో సుమారు రూ.251 కోట్ల విలువ చేసే టీడీఆర్‌ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచు కున్నాడన్నారు. ఇదే ప్రాంతం ఆనుకుని నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూము లు, పోర్టు భూములు ఉండగా, ద్వారంపూడి తనకు లబ్ధి చేకూరేలా ప్రైవేటు భూమిని ఎంపిక చేసి వాటికి గుట్టుచప్పుడు కాకుండా టీడీఆర్‌ బాండ్లు మంజూరు చేయించాడన్నారు. వక్ర మార్గాల్లో కార్పొరేషన్‌ సొమ్ము దోచుకుంటున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లిపోవడం జరిగిందన్నారు. ద్వారంపూడి దోపిడీకి ప్రస్తుత నగర కమిషనర్‌ సహ కరిస్తూ కార్పొరేషన్‌ సొమ్మును దుర్వినియోగం చేస్తూ కార్పొరేషన్‌ ఖజానాను గుల్ల చేస్తున్నార న్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి గతంలో ఈవిధంగానే కార్పొరేషన్‌ పరిధిలో గల సురేష్‌నగర్‌ ప్రభుత్వ భూమిపై టీడీఆర్‌ బాండ్ల దోపిడీకి అప్పటి అధికారులు బలయ్యారన్నారు. కాకినాడ కార్పొరేషన్‌కు స్పెషల్‌ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్‌ ఉన్పప్పటికీ కార్పొరేషన్‌ సొమ్మును ఈ విధం గా దోచుకుంటున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇటువంటివి పునరావృతం అవు తున్నాయన్నారు. కార్పొరేషన్‌ సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి టీడీ ఆర్‌ బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలన్నారు. దీనిపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రే టివ్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు చేశా రు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు పలివెల రవి, తుమ్మల రమేష్‌, గదుల సాయిబాబు, సీకోటి అప్పలకొండ, వొమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 01:37 AM