కార్మికుల పక్షపాతి చంద్రబాబు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:46 AM
సైకో సీఎం జగన్ నియంతృత్వ పాలనలో అన్నిరంగాల కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన చంద్రబాబుకు ఓట్లేసి తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆపార్టీ టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘరామరాజు కోరారు.

టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు
సర్పవరం జంక్షన్, జనవరి 11: సైకో సీఎం జగన్ నియంతృత్వ పాలనలో అన్నిరంగాల కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన చంద్రబాబుకు ఓట్లేసి తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆపార్టీ టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘరామరాజు కోరారు. గురువారం సర్పవరం జంక్షన్ వద్దకు చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణమూర్తి దంపతులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబా, రాష్ట్ర కార్యదర్శులు కటకంశెట్టి బాబీ, కాళ్ల సత్తిబాబు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఏసుదాసుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జోన్-1 ఇన్ చార్జి కోగంటి లెనిన్, సాయిబాబా, రామకృష్ణ పాల్గొన్నారు.
చంద్రన్న కార్మిక బస్సు యాత్ర సామర్లకోట రాక
సామర్లకోట, జనవరి 11 టీఎన్టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘు రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బస్సుయాత్ర సామర్లకోటకు చేరుకోగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సారధ్యంలో టీడీపీ నాయకులు ఎదురేగి పూలమాలలు వేసి చంద్ర న్న కార్మిక బస్సుయాత్రకు స్వాగతం పలికారు.
రా కదలిరా బహిరంగసభ విజయవంతం : చినరాజప్ప
సామర్లకోట, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెస్సార్‌సీపీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపేందుకు టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు రా కదలిరాపేరిట తునిలో నిర్వహించిన ప్రచారకార్యక్రమం విజయవంతమైందని, జిల్లా నలుమూలలనుంచేగాక పొరుగు జిల్లాల నుంచి సైతం ఊహించని దానికన్నా భిన్నంగా ప్రజలు తరలివచ్చారని టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
రా కదలి రా.. సభకు ఉప్పెనలా తరలివచ్చారు
ఫ మాజీ ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ, జనవరి 11: తుని రా కదలి రా.. సభ టీడీపీ శ్రేణులు విజయ వంతం చేశారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. పార్టీ కార్యా లయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఈ సభకు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి ఉప్పెనలా ప్రజలు త రలివచ్చారన్నారు. నగర అఽధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల సాయి బాబు, పలివెల రవి పాల్గొన్నారు.
బటన్ నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు
మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలురూరల్, జనవరి 11: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ బటన్ నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ది, సూపర్‌సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలశాఖ అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, కోళ్ల బాబూరావు, వీరబాబు పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
సర్పవరం జంక్షన్, జనవరి 11: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఈ సునామీలో వైసీపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఏసుదాసులు అన్నారు. గురువారం రమణయ్యపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తునిలో జరిగిన చంద్రబాబు సభకు తండోపతండాలుగా వచ్చిన జనాలను చూచి వైసీపీ ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు.
వైసీపీ పాలనలో బీసీలకు భవిష్యత్ లేదు
వైసీపీ పాలనలో రెడ్డి సామాజిక వర్గానికి తప్పించి, బీసీలకు ఎటువంటి రాజకీయ భవిష్యత్‌లేదని, తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు, బలహీన వర్గాల నుంచి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్తిబాబు అన్నారు. గురువారం 2వ డివిజన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలనలో బీసీ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు.
టీడీపీ, జనసేనలతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్
ప్రత్తిపాడు, జనవరి 11: టీడీపీ, జనసేనలతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌అని టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల సత్యప్రభరాజా చెప్పారు. గురువారం ఆమె స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల కూటమి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలంతా వైసీపీ అరా చక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఇందుకు జిల్లాలో చంద్రబాబు తునిలో పాల్గొన్న బహిరంగసభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.
భవిష్యత్ గ్యారంటీకి అపూర్వ స్పందన
పెదపూడి, జనవరి 11: వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే జీ.మామిడాడలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిం చింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గ్రామ ప్రజలు దుశ్శాలువాలతో సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు. నల్లమిల్లి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందన్నారు. ప్రతి జనవరిలో జాబు క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఆమాటే మరిచారన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ మహిళా నాయ కులు జుత్తుక సూర్యకుమారి, బండి సత్యవతి, టీడీపీ నాయకులు జుత్తుక కృష్ణ, పుట్టా గంగాధర చౌదరి, గంటా రాజు పాల్గొన్నారు.
పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
జగ్గంపేట, జనవరి 11: మండలంలోని రావులమ్మనగర్‌లోని నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో జగ్గంపేటకు చెందిన వైసీపీ సోషల్‌మీడియా గురజాపు సోమసుందరం, దాసరి సూర్యప్రకాశరావు తదితరులు వైసీపీ పార్టీకి రాజీనామాచేసి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ, టీడీపీ కుండువాలతో పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా సుందరం మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియాలో చురుకుగా పనిచేసి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో వెనక పడడంతో మళ్లీ సోషల్‌మీడియా ద్వారానే తగిన బుద్ధి