Share News

డ్రెడ్జింగ్‌ వ్యతిరేకిస్తూ ధర్నా

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:26 AM

రాజమహేంద్రవరం రూరల్‌/సిటీ, ఫిబ్రవరి 28 : రాజమహేంద్రవరం గాయత్రి ఇసుక ర్యాంప్‌లలో పట్టపగలే ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి అతి సమీపంలో గోదావరి గర్భాన్ని చీల్చి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ర్యాంప్‌లలో డ్రెడ్జింగ్‌ పనులను ఇసుకతీత కార్మికులు అడ్డుకున్నారు. డ్రెడ్జింగ్‌ వల్ల సుమారు 3 వేల మంది కార్మికులకు పనులు లేకుండా పోయాయని వారంతా ఆందోళనకు దిగారు. లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు వెంకట్రావు, శ్రీను,

డ్రెడ్జింగ్‌ వ్యతిరేకిస్తూ ధర్నా
నిరసన వ్యక్తంచేస్తున్న బోటు కార్మికులు

రాజమహేంద్రవరం రూరల్‌/సిటీ, ఫిబ్రవరి 28 : రాజమహేంద్రవరం గాయత్రి ఇసుక ర్యాంప్‌లలో పట్టపగలే ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి అతి సమీపంలో గోదావరి గర్భాన్ని చీల్చి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ర్యాంప్‌లలో డ్రెడ్జింగ్‌ పనులను ఇసుకతీత కార్మికులు అడ్డుకున్నారు. డ్రెడ్జింగ్‌ వల్ల సుమారు 3 వేల మంది కార్మికులకు పనులు లేకుండా పోయాయని వారంతా ఆందోళనకు దిగారు. లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు వెంకట్రావు, శ్రీను, సునీల్‌, అప్పన్న, పోతురాజు, ప్రసాద్‌, కిరణ్‌, వెంకటేశ్వరావు, వంశీలు నిరసన ధర్నా చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అప్పటివరకు పోలీసులుగాని, అధికారులుగాని డ్రెడ్జింగ్‌ను గాలికి వదిలేసి.. ఆందోళన చేస్తున్న కార్మికులను అడ్డుకోవడానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు కళ్లు తెరిచి డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. డ్రెడ్జింగ్‌ తవ్వకాలు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Feb 29 , 2024 | 01:26 AM