Share News

బిల్లులు రావడం లేదు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:53 AM

చేసిన పనులకు బిల్లుల రావడం లేదని, బిల్లులకు కమిషనర్‌ హమీ ఇస్తారా అని అధికార పార్టీ కౌన్సిలర్లు కోడూరి శివరామకృష్ణ, కంఠమణి రమేష్‌బాబు, బత్తి నాగరాజు, అంకోల్లు లిల్లీ ప్రశ్నించారు. కమిషనర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ అన్‌లైన్‌ లాగిన్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయడం వరకే తమ బాధ్యత అని బదులిచ్చారు. కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ, అత్యవసర సమావేశాలతో పాటు బడ్జెట్‌ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన శనివారం నిర్వహించారు.

బిల్లులు రావడం లేదు
సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

  • మునిసిపల్‌ కమిషనర్‌ హామీ ఇస్తారా?

  • అధికార పార్టీ కౌన్సిలర్ల ఆవేదన

  • కొవ్వూరు కౌన్సిల్‌ సాధారణ, అత్యవసర, బడ్జెట్‌ సమావేశం

కొవ్వూరు, జనవరి 27: చేసిన పనులకు బిల్లుల రావడం లేదని, బిల్లులకు కమిషనర్‌ హమీ ఇస్తారా అని అధికార పార్టీ కౌన్సిలర్లు కోడూరి శివరామకృష్ణ, కంఠమణి రమేష్‌బాబు, బత్తి నాగరాజు, అంకోల్లు లిల్లీ ప్రశ్నించారు. కమిషనర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ అన్‌లైన్‌ లాగిన్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయడం వరకే తమ బాధ్యత అని బదులిచ్చారు. కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ, అత్యవసర సమావేశాలతో పాటు బడ్జెట్‌ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ అధికార వైసీపీ అర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్టీలో గుర్తించి సుమారు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు చేయలేక కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారని, మరో నెలలో ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం వుంది ఆ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న పనులకు సంబంధించి 20శాతానికి పైబడి కాంట్రాక్టర్లు టెండరు ఎస్టీమేట్‌ కంటే తక్కువకు వేస్తున్నారు. దీంతో నాణ్యత దెబ్బతింటుందని అసహనాన్ని వ్యక్తం చేశారు. చిన్ని మాట్లాడుతూ కౌన్సిల్‌ తీర్మాణం లేకుండా మున్సిపాలిటీ సాధారణ నిధులతో పట్టణంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వేసే కాంట్రాక్టర్‌ని సీడీఎంఏ ఎలా ఎంపిక చేస్తుందన్నారు. జీరో అవర్‌లో ప్రశ్నించిన అంశాలు, సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, అధికార, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి నెల సాధారణ సమావేశం 15వ తేదీలోగా జరపాలని కోరారు. పాలూరి నీలిమ మాట్లాడుతూ 7వ వార్డులో వలంటీర్లు 2వ సచివాలయంలోని తమ బంధువులను వారు పనిచేసే ప్రాంతంలో మ్యాపింగ్‌ చేసుకుని వారికి లబ్ధి చేకూర్చుతున్నారని, వారిపై చర్యలు తీసకోవాలన్నారు. చీర అరుణ మాట్లాడుతూ 14వ వార్డుకు పైపులైను మరమ్మతులకు గురై తాగు నీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు.

  • రూ.1,33,40,000తో బడ్జెట్‌ ఆమోదం

కొవ్వూరు పురపాలక సంఘం 2024- 25 సంవత్సరానికి రూ.1,33,40,000 ముగింపు నిల్వతో కూడిన బడ్జెట్‌ను కౌన్సిల్‌ ఆమోదించింది. మూలధనం, 20 23-24లో సవరించిన బడ్జెట్‌ అంచనాలను ముగింపు నిల్వను రూ.27,03,75,6 26ను 2024-25 సంవత్సరానికి ప్రారంభ నిల్వగా చూపించారు. మూలధన ఆదాయం రూ.16.97 కోట్లు, ఖర్చులుగా రూ.18.56 కోట్లు, చూపించగా రూ.1, 07,80,000ను 2024-25కు ముగింపు నిల్వగా, శాసనాత్మక నిల్వగా 5శాతం రూ.46,20,000లుగా చూపించారు. చిన్ని మాట్లాడుతూ 2023-24లో కొవ్వూరు మున్సిపాల్టీకి ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎంపీ గ్రాంటు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు ప్రభుత్వం నుంచి అధికార పార్టీ తీసుకురాలేకపోయిందని, గత ఏడాది బడ్జెట్‌లో రాని నిధులు ఈ ఏడాది వస్తాయని ముందుగా ఊహిం చి, బడ్జెట్‌లో అంకెల గారడి చేస్తున్నారా అని అధికారులను నిలదీశారు.

Updated Date - Jan 28 , 2024 | 12:54 AM