Share News

విజేతలకు అభినందనల వెల్లువ

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:07 AM

కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో వనమాడి కొండబాబు గెలుపొందిన సందర్భంగా 10వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి చోడిపిల్లి సతీష్‌ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ గురువారం నిర్వహించారు.

విజేతలకు అభినందనల వెల్లువ

కూటమి విజయంతో కార్యకర్తల సంబరాలు

ఆలయాల్లో పూజలు, సత్కారాలు

కొండబాబు ఇంటి వరకు విజయోత్సవ ర్యాలీ

కాకినాడ సిటీ, జూన్‌ 6: కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో వనమాడి కొండబాబు గెలుపొందిన సందర్భంగా 10వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి చోడిపిల్లి సతీష్‌ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ గురువారం నిర్వహించారు. దుమ్ములపేటలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. డెయిరీఫారమ్‌, కల్పన సెంటర్‌, మెయిన్‌రోడ్‌, జగన్నాథపురం వంతెన మీదుగా కొండబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. తీన్‌మార్‌ డప్పులు, డీజే సౌండ్స్‌ డాన్స్‌ లేస్తూ కొండబాబును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మేరుగు రాజన్న, గంట నూకరాజు అనుసూరి శ్రీను, కొయ్య తాతారావు, కొండ్ర దుర్గాప్రసాద్‌, సూరాడ అజయ్‌, చోడిపిల్లి ప్రేమానందం, తిరిది ఎల్లమ్మ, చోడిపిల్లి సత్యవతి, మల్లె నూకరాజు, సూరాడ సత్యం, పెద్దసంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

వనమాడికి వెంకటేశ్వరుడి జ్ఞాపిక అందజేత

కాకినాడ సిటీ, జూన్‌ 6: కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన వనమాడి కొండబాబును గురువారం ఆయన నివాసంలో వివిధ వర్గాల వారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తిలక్‌స్ట్రీట్‌కు చెందిన నాయకులు బొబ్బిలి గోవిందు, దవులూరి భఢ్రరావు, యూత్‌ సభ్యులు శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవిఅనంతకుమార్‌ కలిసి అభినంద నలు తెలిపారు. సాయంత్రం కొండబాబును నగర ప్రముఖులు, అధికారులు, పార్టీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే విజేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో పూజలు

పెద్దాపురం, జూన్‌ 6: పట్టణ పరిధిలో ఉన్న విశ్వేశ్వరచంద్రశేఖరస్వామి ఆల యం లో ఎమ్మెల్యే విజేత నిమ్మకాయల చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి (బాబు) గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వ హించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అఖండ విజయాన్ని సాధించడంతో ఈపూజా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజాసూరిబాబురాజు, కొరిపూరి రాజు, మేడిది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే విజేత నెహ్రూకు సత్కారం

గండేపల్లి, జూన్‌ 6: జగ్గంపేటలో 52వేల పైచిలుకు ఓట్లు మెజార్టీ సాధించిన కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ను గురువారం మండలంలో సూరంపాలెం, ఎన్టీరాజాపురం, యల్లమిల్లి, గండేపల్లి తదితర గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోర్పు లచ్చయ్యదొర, నాయకులు కుంచే రాజా, పరిమి బాబు, వెలమాటి కాశీ, సుంకవిల్లి రమేష్‌, చాగంటి సత్యనారాయణ, ఇప్పిర్ల బాబి, సుంకవిల్లి సత్యనారాయణ(సీఎం), మాదిరెడ్డి కృష్ణార్జున, మద్దిపూడి సత్యనారాయణ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

20 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా

జగ్గంపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాలు తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. 2004లో కాంగ్రెస్‌ అధికారులు వచ్చిన దగ్గర నుంచి 2024 నేటివరకు మధ్యలో కాంగ్రెస్‌, వైసీపీలో ఈ నియోజకవర్గంలో కృష్ణవేణిసాయి 2024 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ కూటమి అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలుపొందడంతో జగ్గంపేట టీడీపీ కోటగా మరల్చు కున్నారు.

నెహ్రూకు నాయకులు, అధికారులు శుభాకాంక్షలు

జగ్గంపేట మండలం ఇర్రిపాక నెహ్రూ స్వగ్రామంలో ఉదయం నుంచి జనసునామీని తలపిస్తూ గజమాలతో, బొకేలతో, శాలువాలతో క్యూ కట్టికట్టారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. కోర్పు లచ్చయ్యదొర, ఎస్వీఎస్‌ అప్పలరాజు, దాసరి తమ్మన్నదొర, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కోర్పు సాయితేజ, జాస్తి వసంత్‌, పాలూరి బోసుబాబు, మారిశెట్టి భద్రం, కుంచేరాజా, అడబాల వెంకటేశ్వరరావు, వెలమాటి కాశి, ప్రోటు కృష్ణ, సుంకవిల్లి రమేష్‌, బత్తుల సత్తిబాబు, గుండా శివప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫ గోకవరం మండల టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు అడబాల సింగరయ్య, కొత్తపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు దిండి రాజు, కొత్తపల్లి 47వ బూత్‌ ఇన్‌చార్జ్‌ బీఎస్‌ఎన్‌ రాజు, సీనియర్‌ అడ్వకేట్‌ చింతలపూడి రమేష్‌బాబు జ్యోతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌, బీజేపీ ఇన్‌చార్జ్‌ దాట్ల కృష్ణవర్మ, ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీలు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగారాజ్‌, జిల్లా కిస్తాన్‌ మోర్చ ఉపాధ్యక్షుడు బాలిన, యుగంధర్‌, గోకవరం, కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండల అధ్యక్షులు సత్తి వెంకటరెడ్డి, ఏడలి రాంబాబు, తోరాటి వెంకన్న, మేడిశెట్టి వీరబాబు, జిల్లా కమిటీ మెంబర్‌ కొత్త శ్రీనివాస్‌ రెడ్డి, అడపా దొరబాబు, సోషల్‌ మీడియా మణికంఠ, కో కన్వీనర్‌సురేష్‌, ఇనకోటి బాపన్న దొర, బత్తుల వెంకన్నబాబు, సురంపాలెం స్వామి, పల్లా రాము, పడాల సత్య నారాయణ, నాగేంద్ర, రాంబాబు, సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే విజేత నెహ్రూకు అభినందనలు

కిర్లంపూడి, జూన్‌ 6: జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ విజయంతో కిర్లంపూడి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ముక్కొల్లు, సర్పంచ్‌ జ్యోతుల రాంబాబు, రామకృష్ణాపురం సర్పంచ్‌ కంటా సరస్వతి, జగపతినగరం సర్పంచ్‌ గుడాల శ్రీలత రాంబాబు, ముక్కొల్లు టీడీపీ సీనియర్‌ నాయకుడు బస్వా వీరబాబు తదితరులు నెహ్రూ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

అయ్యన్నను సత్కరించిన రౌతులపూడి టీడీపీ నేతలు

రౌతులపూడి, జూన్‌ 6: ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడుని రౌతులపూడి టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ ఈటంశెట్టి సూర్యభాస్కరరావు, గంటా గోపి, అల్లు బుజ్జి, పైల సూరిబాబు దివాణం, అశోక్‌లు నర్శీపట్నం ఆయన నివాసంలో సత్కరించారు. రౌతులపూడిలో శ్రీహర్ష కాన్వెంట్‌ సమీపంలో శెట్టిపేటలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు అభినందనలు తెలుపుతూ మాజీ సర్పంచ్‌ పైల సాంబశివరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో పైల అశోక్‌, ఈటంశెట్టి రమణ, గాడి వరహాలు, గొల్లు గోపి, కర్రి అప్పలనాయుడు, తోట శివ పాల్గొన్నారు.

నానాజీకి నాయకుల అభినందన

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 6: కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యేగా విజయ దుందుభి సాఽధించిన పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)కి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో అభినందించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే మంగళవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి నానాజీ వెళ్లి, గురువారం కాకినాడ తిరిగి వచ్చారు. గురువారం సాయంత్రం వలసపాకల జనసేనపార్టీ కార్యాలయానికి విచ్చేసిన నానాజీని కలిసేందుకు కాకినాడరూరల్‌ నియోజకవర్గంతో పాటూ పెద్దఎత్తున కార్యకర్తలు, కూటమి నాయకులు తరలివచ్చి బొకేలు, గజమాలలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

కూటమి విజయం రాష్ట్రానికి అదృష్టం

కరప, జూన్‌ 6: ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం రాష్ట్రానికి అదృష్టంగా భావించాలని రాష్ట్రీయ హిందూచైతన్య సదస్సు అధ్యక్షుడు పడాల రఘు పేర్కొన్నారు. నడకుదురులో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ సీట్లు కీలకంగా మారిన నేపఽథ్యంలో రాష్ట్రాభివృద్ధికి మహర్ధశ పట్టనుందన్నారు. రాష్ట్ర విభజనతో మనకు జరిగిన అన్యాయాన్ని పూరించడానికి ఇదే చక్కని అవకాశమన్నారు. రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్‌ స్టేటస్‌, పోలవరం నిర్మాణం, రాజధాని అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు.

కూటమి విజయంతో ప్రవాసాంధ్రుల సంబరాలు

కరప, జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రవాసాంధ్రులు సంబరాల్లో మునిగితేలారు. కాకినాడజిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన నామన లక్ష్మిసుప్రియ సహచర మిత్రులు, ఉద్యోగస్తులు జనసేన, టీడీపీ కండువాలు, జెండాలతో లండన్‌ వీధుల్లో ర్యాలీగా తిరిగి భారీ కేక్‌ కట్‌ చేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ కూటమి విజయంపై హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.

ధర్మవరంలో బీజేపీ సంబరాలు

ప్రత్తిపాడు, జూన్‌ 6: కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపట్ల గురువారం మండలంలోని ధర్మవరం బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. స్థానిక మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ఊటా వీరబాబు స్వగృహం వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం రామ్‌కుమార్‌ను బీజేపీ నాయకులు వీరబాబు, నక్కా శ్రీనులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిద్దపు రెడ్డి చంద్రరావు, రామకర్తి సూర్యనారాయణ, దొడ్డి పట్ల సుబ్బరాజు, బొల్లు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాచపల్లి నుంచి అన్నవరానికి పాదయాత్ర

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా వరుపుల సత్యప్రభ రాజా ఘన విజయం సాధించడాన్ని పురస్కరించుకుని గురువారం మండలంలోని రాచపల్లి నుంచి అన్నవరంనకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. స్థానిక మాజీ సర్పంచ్‌ అన్నవరం మాజీ పాలక మండలి సభ్యుడు బుద్దరాజు గోపిరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు చేపట్టిన పాదయాత్రను సత్యప్రభ రాజా ప్రారంభించారు. అనంతరం రాచపల్లి నుంచి 30కిలోమీటర్ల మేర టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ పాదయాత్రచేపట్టి సత్యదేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాచపల్లి ఎంపీటీసీ సభ్యుడు పెదిరెడ్డి నాగేశ్వరరావు, నాగు, హరిబాబు, దుర్గ, చక్రవర్తి, గోపి, శ్రీను, రమణ, సురేష్‌, గణపతి, వీరబాబు, అశోక్‌, బాబ్జి, ప్రకాష్‌, బాబి, రాజా, నాగు, రాము తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజా విజయంలో మేము భాగస్వాములమే’

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 6: ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా ఏపీ ప్రభుత్వ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ శుభాకాంక్షలు తెలిపింది. స్థానిక పెన్షనర్స్‌ భవన్‌లో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. నూతన ప్రభుత్వానికి అన్ని ఉద్యోగ సంఘాలతోపాటు పింఛనుదారులు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రజావిజయంలో తాము భాగస్వాములమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.ఇబ్రహీం, సాజిదా, జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన దివ్య

తుని రూరల్‌, జూన్‌6: తుని ఉమ్మడి అభ్యర్ధిగా విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని యనమల దివ్య జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు దివ్య గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

ఇద్దరు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత ఏవీ నగరానిది

తొండంగి, జూన్‌ 6: తుని నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత యనమల స్వగ్రామం ఏవీ నగరం సొంతం చేసుకుంది. గతంలో తుని రాజ కుటుంబానికి చెందిన రాజా వెంకటకృష్ణంరాజు బహద్దర్‌(రాజా బుల్లిబాబు) ఆయన కుమార్తె ఎం.ఎన్‌. విజయలక్ష్మీదేవి, బుల్లిబాబు మనుమడు రాజా అశోక్‌బాబులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. బుల్లిబాబు కుమార్తె విజయలక్ష్మీ దేవి స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రిగా పదవీ భాద్యతలు నిర్వహించారు. తిరిగి ఇప్పుడు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఒకరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కుటుంబంలో యనమల కుటుంబం కూడా చేరింది.దీంతో ఆఘనత ఏవినగరం సొంతమయ్యింది.

చంద్రబాబు, లోకేష్‌లను కలిసిన సత్యప్రభ

ప్రత్తిపాడు, జూన్‌ 6: టీడీపీ అధినేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లను గురువారం ప్రత్తిపాడు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన వరుపుల సత్యప్రభ రాజా కలిశారు. అమరావతిలోని ఉండవిల్లి నివాసం వద్ద పార్టీ అధినేతలు ఇరువురిని కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరుపుల రాజా ఆశయాలు నెరవేర్చడం కోసం అద్భుతంగా పనిచేశారని ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు అభినందించారు.

చంద్రబాబును కలిసిన జ్యోతుల నవీన్‌

కాకినాడ సిటీ, జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయేలా విజయాన్ని అందుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన కూటమి విజయం వెనుక చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కష్టం ఎంతో ఉందని, ఒక నియంతపై పోరాడి గెలిచిన నేతలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 12:07 AM