ఏం జరిగింది?
ABN , Publish Date - May 26 , 2024 | 01:42 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆనంద్‌నగర్ బెట్టీ కాన్వెంట్ సమీపంలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు మృతి చెందిన ఘటన స్థానికంగా సంచ లనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన చక్రవర్తుల శ్రీధర్(27), ప్రత్తిపాడు సమీపంలోని వొమ్మంగికి చెందిన దేవి(22)కి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడేళ్ల భార్గవ్, ఐదేళ్ల నిక్సీ పిల్లలు ఉన్నారు.
అనుమానాస్పదస్థితిలో భార్యాభర్తల మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు
రాజమహేంద్రవరం, మే 25(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆనంద్‌నగర్ బెట్టీ కాన్వెంట్ సమీపంలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు మృతి చెందిన ఘటన స్థానికంగా సంచ లనం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన చక్రవర్తుల శ్రీధర్(27), ప్రత్తిపాడు సమీపంలోని వొమ్మంగికి చెందిన దేవి(22)కి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడేళ్ల భార్గవ్, ఐదేళ్ల నిక్సీ పిల్లలు ఉన్నారు. శ్రీధర్ తాపీ పనులు చేస్తుంటాడు. రాజమహేంద్రవరంలో జీవనోపాధి బాగుంటుందని మూడేళ్ల క్రితం వచ్చి ఆనంద్‌నగర్‌లో ఉంటున్నారు. పెళ్లయిననాటి నుంచీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, శ్రీధర్‌కి గతంలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగి రెండు కాళ్లు సమస్యతో బాధ పడుతున్నాడని దేవి తండ్రి చక్రరావు చెప్పారు. ఈ క్రమంలో దేవికి ఆరోగ్య సమస్యలు రావడంతో రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. జూన్ 2న పెళ్లిరోజు కావడంతో శ్రీధర్ అత్తవా రింటికి వెళ్లి.. ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు తెచ్చుకొని వొమ్మంగి లోనే పెళ్లిరోజు చేసుకుందామని చెప్పాడు. దీంతో శ్రీధర్, దేవి శనివారం ఉద యం రాజమహేంద్రవరం వచ్చారు. దేవి వచ్చిందని తెలిసి ఇంటి యజ మాని మధ్యాహ్నం వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. ఆమె తిరిగి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వచ్చినా తలుపులు తీయలేదు. ఆమె వెళ్లి దగ్గరలో ఉన్న ఆ దంపతుల బంధువుకు చెప్పింది. ఆమె వచ్చి వెనుక తలుపులు గట్టిగా కొట్టగా అవి తెరుచుకున్నాయి. లోపలకు వెళ్లిన వాళ్లు భార్యాభర్తల మృతదేహాలు చూసి కేకలు వేసి ఏడుస్తూ బయటకు పరుగులు పెట్టారు.
భార్యను చంపేసి?
ఇంటి యజమాని, బంధువు ఇంట్లోకి వెళ్లే సరికి శ్రీధర్ చీరతో ఫ్యానుకు వేలాడుతున్నాడు. ఆమె అరుపులతో అక్కడకు వచ్చిన స్థానికుడు ‘ఎంత పని చేశావురా’ అంటూ కాళ్లు పట్టుకొని ముడి విప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేదని.. దాంతో కత్తెరతో ఫ్యానుకు ఉన్న చీర కత్తిరించినట్టు ఆమె చెప్పారు. దేవి డబుల్ కాట్ మంచం కోడుకి చున్నీతో చాలా మడతలు వేసి బిగించి ఉందన్నారు. దేవి నోరు, ముక్కులోంచి రక్తం వచ్చిన మరకలు ఉన్నాయని దేవి తల్లి చెప్పారు.దీంతో శ్రీధర్, దేవి మధ్య తీవ్ర పెనుగులాట జరిగిందని తెలుస్తోంది. మూడుగదుల ఇంటిలో మధ్య గదిలో ఈ ఘటన జరిగింది. ఆ గదిలో సగం తాగిన మద్యం సీసా, గ్లాసులో మద్యం, పక్కనే కూల్‌డ్రింక్ బాటిల్ ఉండడం గమనార్హం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రీటౌన్ సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు.